రంజీ ట్రోఫీ-2024 ఎలైట్ గ్రూప్-డి పోటీల్లో తమిళనాడు బ్యాటర్ సాయి సుదర్శన్ చెలరేగాడు. ఈ రోజు తమిళనాడు-ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. గ్రూప్ డి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తమిళనాడు ఒక వికెట్ నష్టానికి 379 పరుగులు చేసింది. తమిళనాడు బ్యాటర్లలో సాయి సుదర్శన్ అజేయ డబుల్ సెంచరీ సాధించాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 9 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో.. కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించి ఈ ఘనత సాధించాడు. 42 ఓవర్లో విలియం ఒరోర్కే బౌలింగ్ లో సింగిల్ పూర్తి చేసి ఈ ఘనతను అందుకున్నాడు.
3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా.. భారత్-న్యూజిలాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతోంది. తొలి టెస్టులో భారత్ ఎదురొడ్డుతుంది. కాగా.. నేడు మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. ప్రస్తుతానికి భారత్ 125 పరుగుల వెనుకంజలో ఉంది.
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం బెంగళూరులో న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఆడుతోంది. శుక్రవారం రవీంద్ర జడేజా వేసిన 37వ ఓవర్లో రిషబ్ పంత్ కాలికి గాయం అయ్యింది.
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం బెంగళూరులో న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఆడుతోంది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మొదటి ఇన్నింగ్స్ పూర్తవ్వగా.. టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 297 భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికీ.. సంజు శాంసన్ టీమ్ ఇండియాకు శుభారంభం అందించాడు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉప్పల్ వేదికగా శనివారం మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. అందుకోసం.. టీమిండియా ప్లేయర్స్ హైదరాబాద్కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాళ్లు.. అక్కడి నుంచి నోవాటెల్, తాజ్ కృష్ణ హోటల్కు వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్లకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు సాధర స్వాగతం పలికారు.
ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 82 పరుగుల తేడాతో గెలుపొందింది. 173 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. 19.5 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది.
బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది. 86 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా.. భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. శ్రీలంక ముందు 173 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.