Rohit Sharma: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రెండోసారి తండ్రి అయ్యాడు. భార్య రితికా సజ్దే నవంబర్ 15న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ శర్మ బీసీసీఐ నుంచి సెలవును అభ్యర్థించాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్ రోహిత్ శర్మ ఆడకపోవచ్చని తెలుస్తోంది. రోహిత్, రితిక 13 డిసెంబర్ 2015న వివాహం చేసుకున్నారు. దీనికి క్రికెట్, క్రీడలు, వినోద ప్రపంచంలోని పెద్దలు హాజరయ్యారు. మూడేళ్ల తర్వాత, 2018లో ఈ జంట కూతురు సమైరాకు స్వాగతం పలికారు. ఇప్పుడు, ఆరేళ్ల తర్వాత, రోహిత్-రితిక మళ్లీ తల్లిదండ్రులు అయ్యారు.
Read Also: IND vs SA: స్వదేశంలో సఫారీలు చిత్తు.. 135 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం
రోహిత్ ఇప్పుడు తొలి టెస్టు ఆడతాడా?
ఆగస్టు 22 నుండి పెర్త్‌లో ప్రారంభమయ్యే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాకు బయలుదేరింది. అయితే రోహిత్ శర్మ భారత్‌లోనే ఉన్నాడు. ఇదిలావుండగా, భారత కెప్టెన్ ముంబైలోని నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, రోహిత్ శర్మ మొదటి టెస్ట్‌కు అందుబాటులో ఉన్నట్లు నిర్ధారణ లేదని, మ్యాచ్ ఆడే అవకాశం ఉందని వెల్లడించాడు. గంభీర్ చెప్పిన దానిని బట్టి చూస్తే వీలైనంత త్వరలో రోహిత్ శర్మ త్వరలోనే ఆస్ట్రేలియా బయలుదేరే అవకాశం ఉంది. టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు, ఆస్ట్రేలియా ఏతో భారత్ ఏ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది, ఇందులో ఫామ్ కోసం వెతుకుతున్న కేఎల్ రాహుల్ పేలవ ప్రదర్శన ఇక్కడ కూడా కొనసాగుతోంది. ఇప్పుడు రోహిత్ శర్మ సమయానికి వస్తే మొదటి టెస్టులో ఓపెనింగ్‌లో రానున్నాడు.