IPL 2025: ఐపీఎల్ 2025 కోసం వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో నిర్వహించబడుతుంది. ఈసారి మెగా వేలం జరగనుండడంతో రెండు రోజుల పాటు జరగనుంది. నవంబర్ 24, 25 తేదీల్లో వేలం జరగనుంది. ఈ వేలంలో 574 మంది ఆటగాళ్లలో కేవలం 204 మందిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. బిడ్‌లో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. చాలా మంది దిగ్గజ ఆటగాళ్ల పేర్లు ఈ జాబితాలో లేవు. ఐపీఎల్‌లో బాగా రాణించిన ఆటగాళ్ల పేర్లు కూడా లిస్ట్‌లో లేకపోవడం గమనార్హం. ఆ లిస్ట్‌లో లేని ఐదుగురి దిగ్గజ ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.
సౌరభ్ నేత్రవాల్కర్
భారత్‌లో జన్మించిన అమెరికా ఫాస్ట్ బౌలర్ సౌరభ్ నేత్రవాల్కర్ టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. అమెరికా మేజర్ లీగ్ క్రికెట్ 2024 సీజన్‌లో, అతను 7 మ్యాచ్‌ల్లో గరిష్టంగా 15 వికెట్లను తీశాడు. దీని తర్వాత కూడా ఈ ఐపీఎల్ వేలం జాబితాలో అతని పేరు లేదు.
Read Also: Myke Tyson vs Jake Paul Fight: మైక్ టైసన్‌ను మట్టి కరిపించిన 27 ఏళ్ల యూట్యూబర్
కామెరాన్ గ్రీన్
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ కూడా ఐపీఎల్ 2025లో పాల్గొనడం లేదు. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో భాగంగా ఉన్నాడు. కానీ వేలానికి ముందు అతని పేరు లిస్ట్‌లో లేకపోవడం గమనార్హం. వెన్ను గాయంతో కనీసం ఆరు నెలల పాటు గ్రీన్ ఆటకు దూరంగా ఉన్నాడు.
బెన్ స్టోక్స్
ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరు కూడా లేదు. స్టోక్స్ చివరిసారిగా 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. రెండు మ్యాచ్‌లు ఆడి 15 పరుగులు మాత్రమే చేశాడు. అతను మొత్తం సీజన్‌లో బెంచ్‌పై కూర్చోవలసి వచ్చింది.
జోఫ్రా ఆర్చర్
ఐపీఎల్ 2025 వేలం జాబితాలో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ పేరు లేదు. 2022 వేలంలో ఆర్చర్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. గాయం కారణంగా, అతను 2022 సీజన్ ఆడలేకపోయాడు. 2023 సీజన్‌లో కూడా అతను కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా అతను 2024 సీజన్‌లో కూడా పాల్గొనలేదు.
అమిత్ మిశ్రా
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకరైన అమిత్ మిశ్రాను కూడా వేలంలో చేర్చలేదు. ఐపీఎల్‌లో అత్యధిక హ్యాట్రిక్‌లు కూడా అతని పేరిటే ఉన్నాయి. అమిత్ మిశ్రా IPL 2023, 2024 సహా 8 మ్యాచ్‌లు ఆడాడు. అతను 2022 మెగా వేలంలో అమ్ముడుపోలేదు.