ప్రపంచకప్ 2023లో భాగంగా ఇండియాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. అయితే ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండింటిలో గెలువగా.. ఒక మ్యాచ్ లో ఓడిపోయింది. రేపు కంగారుల జట్టుతో తలపడనుంది. టీమిండియాతో ఓడిన పాకిస్తాన్ జట్టుకు సర్వత్రా విమర్శలు చేస్తున్నారు. తమ దేశం వాళ్లే కాకుండా, పొరుగు దేశం వాళ్లు కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. తాజాగా.. భారత మాజీ క్రికెట్ ప్లేయర్ శ్రీశాంత్ పాకిస్తాన్ చురకలు అంటించాడు.
Read Also: Revanth Reddy: సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే.. మీరు బిచ్చం ఎత్తుకుని బతికేవాళ్ళు
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఒకప్పుడు బలమైన జట్టుగా ఉండేదని.. నిప్పులు చెరిగే పేస్ బౌలర్లు, బంతిని గింగిరాలు తిప్పే స్పిన్నర్లు ఉండేవాళ్లని, అంతేకాకుండా బ్యాట్స్ మెన్లు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండేవారని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడున్న పాకిస్తాన్ జట్టులో అలాంటి పరిస్థితి కనిపించడం లేదన్నాడు. ప్రస్తుత వరల్డ్ కప్ లో కూడా ఆ జట్టు పేలవమైన ప్రదర్శన చేసిందని.. అహ్మదాబాద్ లో ఇండియాతో జరిగిన మ్యాచ్ లో అన్ని విభాగాల్లో చేతులెత్తేసి ఘోరంగా ఓడిపోయిందని చెప్పాడు.
Read Also: Tamannah Bhatia :మరోసారి రెచ్చిపోయిన మిల్క్ బ్యూటి.. రెడ్ డ్రెస్సులో కిల్లింగ్ లుక్స్..
ఈ వరల్డ్ కప్ ఫైనల్స్ లో టీమిండియా-పాకిస్తాన్ తలపడబోతాయని పాక్ కోచ్ – డైరెక్టర్ మిక్కీ ఆర్థర్ చెప్పాడని… అయితే, ఈ వరల్డ్ కప్ లోనే కాదు… మరే ఐసీసీ ట్రోఫీలో పాక్ జట్టు గెలిచే అవకాశం ఉండకపోవచ్చని శ్రీశాంత్ విమర్శించాడు. పాక్ ప్రధాన జట్టును ఇండియా C టీమ్ కూడా ఓడిస్తుందంటూ ఎద్దేవా చేశాడు. ఐపీఎల్ లో ఆడిన ప్రతి భారత క్రికెటర్ కు పాకిస్థాన్ ను ఓడించే సత్తా ఉందని అన్నాడు. ఇలాంటి ఆట తీరుతో పాక్ జట్టు ఎప్పటికీ ఐసీసీ టోర్నీలను గెలవలేదని చెప్పాడు.