ప్రపంచకప్ లో భాగంగా చెన్నై వేదికగా ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ మ్యాచ్ లో 108 బంతులు ఆడిన మార్ష్ 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 121 పరుగులు చేశాడు.
Read Also: Health Tips: హలీమ్ విత్తనం పోషక భాండాగారం.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!
ఇదిలా ఉంటే.. ఈ సెంచరీ మిచెల్ మార్ష్ కు స్పెషల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అతని పుట్టిన రోజు ఈరోజే. తన బర్త్ డే రోజే సెంచరీని సాధించడం విశేషం. అక్టోబర్ 20న మార్ష్ 32వ వసంతంలోకి అడుగుపెట్టాడు. దీంతో తన బర్త్‌డే రోజున సెంచరీ చేసి మార్ష్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
Read Also: Israel-Hamas War: డ్రగ్స్ మత్తులో హమాస్ ఉగ్రవాదుల అరాచకం.. ఇజ్రాయిల్‌పై దాడిలో కొత్త విషయాలు..
వన్డే ప్రపంచకప్‌లో బర్త్‌డే రోజున సెంచరీ నమోదు చేసిన రెండో ఆటగాడు. ఇంతకు ముందు ఈ ఘనత సాధించిన వారిలో మొదటి స్థానంలో కివీస్ దిగ్గజం రాస్ టేలర్ ఉన్నాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై టేలర్ తన బర్త్ డే రోజు సెంచరీ చేశాడు. అయితే వీరిద్దరిలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. పాకిస్తాన్ పైనే సెంచరీ చేయడం. ఓవరాల్‌గా అంతర్జాతీయ వన్డేల్లో ఈ ఫీట్ సాధించిన లిస్ట్‌లో మార్ష్ ఆరో స్ధానంలో నిలిచాడు.