వరల్డ్ కప్ 2023లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో పాకిస్తాన్ జట్టు పెద్దగా ఫామ్‌లో ఉన్నట్టు కనిపించలేదు. దీనికి ప్రధాన కారణం వారి బౌలర్లే. ఇంతకుముందు పాకిస్తాన్ జట్టు అంటే అందరికి తెలసింది వారి బౌలింగ్ గురించే. కానీ ఈ ప్రపంచకప్‌లో బౌలింగ్ విభాగంలో ప్రదర్శన చూపించలేకపోతుంది. పాకిస్తాన్ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది కూడా ఫామ్‌లో లేకపోయినా.. ఈరోజు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో షాహీన్ ఆఫ్రిదీ ఒంటిచేతితో పరుగుల వరదను ఆపాడు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లు శుభారంభం చేశారు. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌లు సెంచరీలు చేసి తొలి వికెట్‌కు 259 పరుగులు సాధించారు. ఆ తర్వాత 32వ ఓవర్‌లో షహీన్ పాక్‌కు తొలి వికెట్‌ని అందించాడు. సెంచరీ చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మార్ష్ వికెట్ తీశాడు. ఆ తర్వాతి బంతికే గ్లెన్ మాక్స్‌వెల్‌ను కూడా ఔట్ చేశాడు.
Read Also: Michelle Marsh: బర్త్ డే ఇన్నింగ్స్.. గుర్తిండిపోయే రోజు ఇదే
ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్లందరూ ఆస్ట్రేలియాకు పరుగుల దారపోశారు. కానీ.. షాహీన్ వేసిన బౌలింగ్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు కొంచెం తడబడ్డారు. అతను వేసిన అద్భుత బౌలింగ్తో 5 వికెట్లు తీశాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాను ఒక్కో పరుగు కోసం కష్టపడేలా చేశాడు. షాహీన్ 5.40 ఎకానమీ రేటుతో 10 ఓవర్లలో 54 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అందులో ఒక మెయిడిన్ ఓవర్ కూడా ఉంది. షాహీన్‌తో పాటు, హరీస్ రవూఫ్ కూడా 3 వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలవాలంటే తమ రికార్డును తానే బద్దలు కొట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 344 పరుగుల ఛేదనలో విజయం సాధించింది. ఇది ప్రపంచకప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన పరుగుల వేటగా నిలిచింది. ఈరోజు పాకిస్థాన్ గెలవాలంటే.. ప్రపంచకప్‌లో అత్యంత విజయవంతమైన పరుగుల వేటలో తమ రికార్డును తానే బ్రేక్ చేసుకోవాలి.