Michelle Santner: ప్రపంచకప్ 2023లో భాగంగా టీమిండియా తర్వాతి మ్యాచ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం కివీస్ జట్టు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. అందుకు సంబంధించి న్యూజిలాండ్ టీమ్ స్టార్ స్పిన్ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. పవర్‌ప్లేలో టీమిండియాను ముందుగా ఆపాల్సి ఉంటుందని చెప్పాడు. ఎందుకంటే రోహిత్ బ్యాటింగ్ చేసే విధానం, పవర్‌ప్లేలో తమ ప్రదర్శన చాలా ముఖ్యమైనదని రుజువు చేస్తుందన్నాడు.
Read Also: Smriti Irani: సిద్దిపేటకి రైలు ఇచ్చిన ఘనత ప్రధాని మోడీదే..
ఇండియా పిచ్‌లలో కొంత పేస్, బౌన్స్ ఉంటాయి. అయితే ప్రతిసారి అలాంటి పరిస్థితులు ఉండకపోవచ్చని అన్నాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ఆచితూచి బౌలింగ్ వేస్తామని చెప్పాడు. ఇంతకుముందు ఆడిన విధానంగానే ఆడుతామని.. బౌలింగ్ లో కష్టపడతామన్నాడు. టీమిండియాపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని.. కానీ ఏమి జరుగుతుందో చూడాలని సాంట్నర్ చెప్పుకొచ్చాడు. మరోవైపు ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ ల్లో టీమిండియా అద్భుతంగా ఆడిందని తెలిపాడు. తమ హోంగ్రౌండ్ కాబట్టి భారత్ కు కలిసొస్తుందని పేర్కొన్నాడు. మాకు కలిసొచ్చే విషయమేటంటే.. తాము కూడా మంచి స్థితిలో ఉన్నామని.. ఇంకా మెరుగుపడాలని అనుకుంటున్నామన్నాడు.
Read Also: India-Canada Row: కెనడా కవ్వింపు ధోరణి.. భారత్‌లో ఈ ప్రాంతాల్లో జాగ్రత్త అంటూ ట్రావెల్ అడ్వైజరీ..
అక్టోబర్ 22న ధర్మశాలలో భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ప్రపంచ కప్ 2023 పాయింట్ల పట్టికలో ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ టాప్-2 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 4-4 మ్యాచ్‌లు ఆడిన ఇరు జట్లు అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాయి. అయితే ఇప్పుడు ధర్మశాలలో జరిగే మ్యాచ్ ఈ జట్ల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది.