తాజా ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శన కనపరుస్తుంది. దీంతో పీసీబీలో గందరగోళం నెలకొంది. పాకిస్థాన్ క్రికెట్‌లో ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ జట్టు చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ తన పదవికి రాజీనామా చేశారు. సోషల్‌మీడియాలో తనపై వస్తున్న అవినీతి ఆరోపణల (క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్) నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంజమామ్ వెల్లడించాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సైతం ధృవీకరించింది.
Read Also: Minister Talasani: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని అంత ఆషామాషీగా తీసుకోకూడదు..
2023 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు చాలా ఘోరమైన ఫామ్‌లో ఉంది. బాబర్ అజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ క్రికెట్ జట్టు 6 మ్యాచ్‌లు ఆడి.. 4 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది. పాకిస్తాన్ పేలవ ప్రదర్శనతో పాక్ మాజీ ఆటగాళ్లు, చాలా మంది క్రికెట్ నిపుణులు.. కెప్టెన్ బాబర్ అజామ్‌ను తిట్టిపారేసుకుంటున్నారు. కెప్టెన్ గా బాబర్ ఆజం సరికాదని.. జట్టు బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమయ్యాడని విమర్శలు చేస్తున్నారు.
Read Also: MP GVL Narasimha Rao: ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో భద్రతా సమస్యలు.. రైల్వేమంత్రికి ఎంపీ జీవీఎల్ లేఖ
ప్రపంచ కప్ లో తొలి రెండు మ్యాచ్ ల్లో శుభారంభం అందించినప్పటికీ.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. మూడో మ్యాచ్ ఇండియాతో మొదలు నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, దక్షిణాఫ్రికాపై ఓడిపోయింది. మరోవైపు పాకిస్థాన్ టీమ్ సెమీస్ కు వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ అన్నింటికీ అన్ని మ్యాచ్ ల్లో గెలిచి తీరాలి.