రూ.19,037 కోట్ల పెట్టుబడులకు ఆమోదం.. 69,565 కొత్త ఉద్యోగాలు..
రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది.. తద్వారా కొత్తగా 69 వేలకు పైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ రోజు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది.. పలు పరిశ్రమల ప్రతిపాదనలకు, ప్రోత్సాహకాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.. ఈ సమావేశంలో మొత్తంగా రూ.19,037 కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర పడింది.. వాటి ద్వారా 69,565 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేయడంతో పాటు కీలక సూచనలు చేశారు సీఎం వైఎస్ జగన్.. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగంలో అనూహ్య మార్పులు వస్తున్నాయి.. పరిశ్రమల ఉత్పాదకతలో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి అన్నారు సీఎం జగన్.. వీటన్నింటినీ అధికారులు ఎప్పటికప్పుడు అవగాహణ చేసుకోవాలి.. ప్రపంచ పారిశ్రామిక రంగం పోకడలను అవగతం చేసుకోవాలి.. ఆ మేరకు పారిశ్రామిక విధానాల్లో మార్పులు, చేర్పులు చేయాలన్నారు. అత్యంత పారదర్శకత విధానాల ద్వారా అత్యంత సానుకూల వాతావరణాన్ని తీసుకురాగలిగాం.. ఈ క్రమంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచామన్నారు. ఈ ప్రయాణం మరింతగా ముందుకు సాగాలి.. పరిశ్రమల పట్ల సానుకూల క్రియాశీలతను మరింత బలోపేతం చేయాలి.. పరిశ్రమల ఏర్పాటుకోసం ఇచ్చే అనుమతులు, తదితర అంశాల్లో ప్రభుత్వం నుంచి వేగంగా స్పందిస్తున్నాం.. ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉన్నామన్న భరోసాను వారికి కల్పిస్తున్నాం.. అనుమతులు, క్లియరెన్స్ విషయంలో ఇప్పుడున్న వేగాన్ని మరింతంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు సీఎం జగన్.
విజయనగరం రైలు ప్రమాదం.. విచారణ ప్రారంభం
విజయనగరం రైలు ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది.. కీలకమైన ఆధారాలు సేకరిస్తున్నారు కమిషన్ అధికారులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ.. ఓవైపు 20 గంటల తర్వాత ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి అయ్యాయి.. ఈ ప్రమాదంలో నిజ్జునుజ్జయిన ఏడు బోగీలను తొలగించారు.. విజయవాడ-విశాఖపట్నం అప్ లైన్ & డౌన్ లైన్ పనులు పూర్తి చేశారు.. మిడిల్ లైన్ ఆపరేషన్స్ లోకి రావడానికి మరికొద్ది గంటల సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు.. అందుబాటులోకి వచ్చిన అప్ & డౌన్ లైన్లలో ట్రైన్ల రాకపోకల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు.. అయితే, ప్రమాదానికి గల పూర్తి కారణాలు సేఫ్టీ కమిషన్ విచారణ తర్వాత తేలనుంది.. పలాస ప్యాసింజర్ ను వెనుక నుంచి రాయగఢ్ ఎక్స్ప్రెస్ ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగిందని డీఆర్ఎం సౌరభ్ కుమార్ తెలిపారు.. ఇక, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని.. అన్ని వివరాలు తెలియజేస్తామన్నారు.
విజయనగరం రైలు ప్రమాద బాధితులకు సీఎం పరామర్శ.. అండగా ఉంటామని భరోసా..
విజయనగరం జిల్లా కంటాకపల్లి రైలు ప్రమాద ఘటనలో ఇప్పటికే 15 మంది మృతిచెందినట్టు గుర్తించారు అధికారులు.. తీవ్రగాయాపాలమైన చాలా మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.. ఇక, రైలు ప్రమాద బాధితుల్ని పరామర్శించారు సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లి నుంచి విజయనగరం వెళ్లిన ఆయన.. మొదట విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి బయట రైలు ప్రమాదంపై అధికారులు ఏర్పాటు చేసిన చిత్రాలను పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆపై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు.. ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించాలనుకున్నారు సీఎం వైఎస్ జగన్.. అయితే, ఘటనా స్థలంలో సహాయక చర్యలు జరుగుతోన్న నేపథ్యంలో.. రైల్వే అధికారుల విజ్ఞప్తితో నేరుగా బాధితుల్ని పరామర్శించారు ఏపీ సీఎం.. తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకున్నారు.. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో పోలీస్ శిక్షణ కళాశాల మైదానంలో వున్న హెలిప్యాడ్‌లో దిగారు.. ఆపై విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు.. వారికి ధైర్యాన్ని చెప్పారు.. అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు.
ఎంపీ కొత్త ప్రభాకర్ పై దాడి.. కత్తితో దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని కత్తితో పొడిచి హత్యయత్నం చేసిన నిందితునిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారంలో భాగంగా ఈరోజు దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ప్రచారం చేస్తుండగా.. గడ్డం రాజు అనే వ్యక్తి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని కలవడానికి దగ్గరికి వచ్చి కత్తితో పొడిచి హత్యయత్నం చేశాడు. దీంతో వెంటనే అక్కడ ఉన్న కార్యకర్తలు తెరుకొని పై నిందితున్ని పోలీసులకు అప్పగించినారు. అయితే, ప్రస్తుతం నిందితుడు రాజు పోలీస్ కస్టడీలో ఉన్నాడు.. గాయపడిన ఎంపీ ప్రభాకర్ రెడ్డిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించడంతో అక్కడ.. చికిత్స చేస్తున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. హత్యయత్నం చేసిన గడ్డం రాజుపై కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగిందని పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత తెలిపారు. అయితే, కొత్త ప్రభాకర్ రెడ్డికి బలమైన గాయం అయింది. కత్తి పోటు మూడు ఇంచులు లోపలికి దిగినట్లు డాక్టర్లు తెలిపారు. ఆపరేషన్ థియేటర్ లోకి వైద్యలు తీసుకెళ్లారు. కాసేపట్లో కొత్త ప్రభాకర్ రెడ్డికి యశోద ఆస్పత్రిలో సర్జరీ జరుగనుంది. ఇక, విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు. అలాగే, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కేశవరావు యశోద ఆస్పత్రికి చేరుకున్నారు.
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి.. భావోద్వేగానికి లోనైన మంత్రి హరీశ్ రావు
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డితో ఆయనకు సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, యశోద ఆస్పత్రిలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని మంత్రి హరీశ్ రావు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభాకర్ రెడ్డికి బలమైన గాయం అయిందని డాక్టర్లు చెప్పారు.. స్కాన్ చేసిన తర్వాత.. ఆపరేషన్ అవసరమని చెప్పారు.. ప్రస్తుతం సర్జరీ జరుగుతోంది అని మంత్రి తెలిపారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి గజ్వేల్ లో ప్రాథమిక చికిత్స అందించాం.. రక్త స్రావం ఎక్కువ అవుతోంది.. హైదరాబాద్ తీసుకెళ్ళమని డాక్టర్లు చెప్పారు అని చెబుతూ మంత్రి హరీశ్ రావు భావోద్వేగానికి లోనైయ్యారు. అన్నారు. భౌతిక దాడులకు, హత్యా యత్నాలకు దిగడం సరైంది కాదు.. దాడి చేసిన వ్యక్తి ఎవరు… ఎందుకు చేశాడు అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. కాసేపట్లో సీఎం కెసిఆర్ ఆస్పత్రికి వస్తారు అని ఆయన తెలిపారు. కత్తితో దాడి చేస్తున్న క్రమంలో అడ్డుకోబోయిన ఎంపీ గన్ మెన్ చేతికి కూడా గాయం అయిందని హరీశ్ రావు పేర్కొన్నారు. ఇలాంటి దాడులు చేయడం పద్దతి కాదన్నారు. ఇక, సికింద్రాబాద్ లోని ఆస్పత్రికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. బీజేపీకి, ఎమ్మెల్యే రఘునందన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బీజేపీ అంతు చూస్తాం అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆస్పత్రి దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూస్తున్నారు.
కరోనా బాధితులకు బిగ్ అలర్ట్.. గుండెపోటు కేసులపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన
భారతదేశంలో వేగంగా పెరుగుతున్న గుండెపోటు కేసులు కరోనా మహమ్మారికి సంబంధించినదా? అనే ప్రశ్న నేడు అందరి మదిలో మెదులుతోంది. అవును ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గుండెపోటుకు అసలు కారణం, దానిని నివారించడానికి మార్గాలను చెప్పారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) చేసిన అధ్యయనాన్ని ఉదహరిస్తూ.. గతంలో తీవ్రమైన కొవిడ్ -19 వ్యాధితో బాధపడిన వ్యక్తులు ఒకటి లేదా రెండు సంవత్సరాల పాటు ఒత్తిడితో, శ్రమతో కూడిన పనులు చేయకపోవడం మంచిదని సూచించారు. శారీరక శర్మ లేకుండా ఉంటే వారు గుండెపోటు నుంచి తమను తాము రక్షించుకోవచ్చన్నారు. ఇటీవల గుండెపోటు మరణాలు పెరుగుతోన్న నేపథ్యంలో వీటిపీ ఐసీఎంఆర్ చేసిన అధ్యయనాన్ని ఆయన వివరించారు. కరోనా బాధితులు గుండెపోటు బారిన పడకుండా ఉండాలంటే.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత రెండేళ్ల వరకూ కఠిన వ్యాయామాలకు దూరంగా ఉండాలన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ విలేకరులతో మాట్లాడుతూ, “ICMR ఒక వివరణాత్మక అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం ప్రకారం, తీవ్రమైన కోవిడ్ -19 ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వ్యక్తులు శ్రమతో కూడిన పని చేయకూడదు. వారు ఎక్కువ సమయం పాటు విశ్రాంతి తీసుకోవాలి. వ్యాయామం, పరుగు, అధిక వ్యాయామం నుంచి ఒక సంవత్సరం లేదా అవసరమైన దానికంటే ఎక్కువ కాలం దూరంగా ఉండండి, తద్వారా గుండెపోటును నివారించవచ్చు.” అని ఆయన వివరించారు.
బెట్టింగ్ యాప్‌లో ఐపీఎల్ ప్రమోషన్.. పోలీసుల ముందు ప్రత్యక్షమైన రాపర్ బాద్‌షా
బాలీవుడ్ రాపర్ బాద్‌షా సోమవారం మహారాష్ట్ర సైబర్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఫెయిర్‌ప్లే అనే బెట్టింగ్ యాప్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్‌లను వీక్షించడాన్ని ప్రోత్సహించినందుకు వయాకామ్ 18 నెట్‌వర్క్ రాపర్ బాద్‌షా, నటుడు సంజయ్ దత్‌తో సహా 40 మంది ఇతర నటులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. వయాకామ్ 18 మ్యాచ్‌లను ప్రసారం చేయడానికి మేధో సంపత్తి హక్కులు (IPR) కలిగి ఉంది. అయితే మ్యాచ్‌లు చట్టవిరుద్ధంగా ఫెయిర్‌ప్లేలో ప్రసారం చేయబడ్డాయి. కొంతమంది నటులు ఫెయిర్‌ప్లే యాప్‌లో టోర్నమెంట్‌ను ప్రచారం చేశారని మీడియా నెట్‌వర్క్ తెలిపింది. ఈ విషయంలో డిజిటల్ పైరసీ కేసు నమోదైంది. ఈ కేసులో మరింత మంది నటీనటులకు సమన్లు వచ్చే అవకాశం ఉంది. ఫెయిర్‌ప్లే యాప్ సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ ద్వారా ప్రమోట్ చేయబడిన మహాదేవ్ యాప్‌కి కనెక్ట్ చేయబడింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రస్తుతం మహాదేవ్ బుక్ యాప్‌పై మనీలాండరింగ్‌పై విచారణ జరుపుతోంది. ఈ కేసుకు సంబంధించి రణ్‌బీర్ కపూర్, హుమా ఖురేషి, కపిల్ శర్మ, శ్రద్ధా కపూర్‌లతో సహా పలువురు ప్రముఖులకు సమన్లు అందాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగిన చంద్రకర్ వివాహానికి బాలీవుడ్ ప్రముఖులు సంజయ్ దత్, సునీల్ శెట్టి, టైగర్ ష్రాఫ్ తదితరులు హాజరయ్యారు.
4 వరుస ఓటముల తర్వాత కూడా పాకిస్తాన్ సెమీస్కు చేరుకోగలదు.. ఎలా అంటే..!
ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన తర్వాత మళ్లీ గెలుపొందలేదు. మొత్తం 6 మ్యాచ్ ల్లో రెండు గెలిచి, నాలుగు ఓడిపోయారు. ఇంకా పాకిస్తాన్ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకోవాలన్న కల దాదాపుగా చెదిరిపోయినట్లే.. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ఇప్పటికీ ఈ ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకోగలదు. అందుకోసం జట్టు అద్భుతమైన ప్రదర్శనతో పాటు మిగిలిన 9 జట్ల గెలుపు ఓటమిలపై ఆధారపడి ఉంటుంది. ఈ 6 సమీకరణాలు వర్క్ ఔట్ అయితే.. ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకోగలదు. మీరు ఈ సమీకరణాలను జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ టోర్నమెంట్‌లోని మిగతా 9 జట్ల గెలుపు లేదా ఓటమిపై పాకిస్తాన్ సెమీ-ఫైనల్‌కు చేరుకోవడం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ ఇంకా సెమీఫైనల్‌కు చేరితే అది నిజంగా అద్భుతమే.
అబ్బా.. ఏం అందం మావ.. రెండు కళ్లు చాలట్లేదు..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోలతో యువతను చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది.. నాజుకు అందాలతో నిద్రలేకుండా చేస్తుంది.. తాజాగా పలుచని డ్రెస్సులో పరువాల విందు చేసింది.. అదిరిపోయే పోజులతో ఫోటోలను దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది..రెండు భిన్నమైన దుస్తుల్లో అమ్మడు ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నారు. రష్మిక ఫోటో షూట్ వైరల్ అవుతుంది.. అమ్మడు ఫ్యాన్స్ వాటిని మరింత వైరల్ చేస్తున్నారు.. తాజాగా ఈ అమ్మడు ఓ బ్రాండ్ ను ప్రమోట్ చేశారు.. ఈ క్రమంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. గార్మెంట్ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ స్టైలిష్ పోజుల్లో మనసులు దోచేసింది. ముఖ్యంగా ఆరంజ్ కలర్ ఫ్రాక్ లో రష్మిక కిరాక్ పుట్టించేలా ఉన్నారు. రష్మిక గ్లామర్ పై ఫ్యాన్స్ కామెంట్స్ చేయకలేకున్నారు… ఇక ఈ మధ్య పాప బాగా స్పీడ్ గా ఉంది.. బాలివుడ్ లో రష్మిక నటించిన పాన్ ఇండియా మూవీ యానిమల్ విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న యానిమల్ డిసెంబర్ 1న విడుదల కాబోతుంది..
లుక్ అదిరింది.. హిట్ కూడా ఇస్తే బావుంటుంది
అక్కినేని హీరోలు ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అక్కినేని నాగ చైతన్యకు ఒక భారీ హిట్ కోసం తెగ కష్టపడుతున్నాడు. కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం నాగ చైతన్య.. చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక నాగ చైతన్య మొదటిసారి బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాతో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో చై సరసన సాయి పల్లవి నటిస్తోంది. 2018లో సముద్రంలో వేటకు వెళ్లిన శ్రీకాకుళం మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గోర్డ్ లకు బందీలుగా చిక్కి దాదాపు ఏడాది పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. వారి జీవితాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు చందు మొండేటి. ఇప్పటికే ఈ కథ కోసం శ్రీకాకుళం మత్స్యకారులను కలిసి వారి బాధలను తెలుసుకున్నారు. ఇక ఈ సినిమా కోసం చై లుక్ మార్చాడు. గడ్డం, జుట్టు పెంచి అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించాడు. ఒక లోకల్ మత్స్యకారుడుగా నాగచైతన్య రియాలిటీ కి తగ్గట్టుగా తనను తాను చేంజ్ చేసుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఇక ఈ లుక్ లోనే చై బయట కనిపించడంతో.. అదే సినిమా లుక్ అని అభిమానులు ఫిక్స్ చేసేస్తున్నారు. ఇక ఈ లుక్ లో చై అదిరిపోయాడు. దీంతో అభిమానులు లుక్ అదిరింది.. హిట్ కూడా ఇస్తే బావుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో చై ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.