వన్డే ప్రపంచకప్-2023లో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. చిన్న జట్లు పెద్ద జట్లను ఓడించడం, డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించడం.. ఇలా వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీలో అతిథ్య భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు 6 విజయాలు సాధించిన టీమిండియా సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖారారు చేసుకుంది.
Read Also: Pakistan Team: 4 వరుస ఓటముల తర్వాత కూడా పాకిస్తాన్ సెమీస్కు చేరుకోగలదు.. ఎలా అంటే..!
ఇక.. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. అయితే టాప్-4లో వరుసగా భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఫైనల్‌కు చేరుకునే రెండు జట్లను ఆస్ట్రేలియా స్పిన్నర్ అస్టన్ అగర్ ఎంచుకున్నాడు. ఈ మెగా టోర్నీ ఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడతాయని అగర్ జోస్యం చెప్పాడు.
Read Also: White Hydrogen: వైట్ హైడ్రోజన్ నిల్వలను కనుగొన్న శాస్త్రవేత్తలు.. ప్రపంచానికి రక్షణగా మారనున్నాయా?
వరల్డ్‌కప్ ఫైనల్ భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతుందని.. టీమిండియా టైటిల్ ఫేవరేట్ అంతా భావిస్తున్నారని అగర్ అన్నాడు. స్వదేశంలో వరల్డ్‌కప్ జరుగుతుండడంతో టీమిండియాపై కచ్చితంగా ఒత్తిడి ఉంటుందని.. దాంతో జట్టు తప్పులు చేస్తుందని చెప్పాడు. ఫైనల్లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధిస్తే.. ప్రత్యర్ధిపై పైచేయి సాధించే ఛాన్స్ ఉందని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అగర్ పేర్కొన్నాడు.