Viral Video: క్రికెట్లో గాయపడటం సహజం.. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గానీ, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, బౌలింగ్ చేస్తున్నప్పుడు చిన్నచిన్న గాయాలు అవుతుంటాయి. ఒక్కొక్కసారి నాన్ స్ట్రైకర్లో ఉన్న బ్యాట్స్మెన్కు, బౌలర్కు గాయాలవ్వడం చూస్తుంటాం. తాజాగా ఈ వీడియోలో కూడా స్ట్రైకింగ్లో ఉన్న బ్యాట్స్మెన్ కు బంతి వేగంగా వచ్చి తాకుతుంది. స్ట్రైకింగ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ బాల్ను కొడితే.. నాన్ స్ట్రైక్లో ఉన్న బ్యాటర్కు తాకుతుంది. ఇంతవరకు సరే.. కానీ బౌలర్ బాల్ వేసిన విధానం.. బ్యాట్స్మెన్ కొట్టిన విధానం చూస్తే మీరు నవ్వు ఆపుకోలేకపోతారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Graeme Smith: సొంత గడ్డపై భారత్‌ను ఓడించడం ప్రత్యర్థులకు కష్టమే
ఈ వీడియోలో.. బౌలర్ రన్‌అప్‌తో వచ్చి నేరుగా బ్యాట్స్‌మెన్ వైపు బంతిని విసిరే క్రమంలో జారి గాలిలోకి వెళ్తుంది. ఆ బంతిని కొట్టాలనే ఆత్రుతతో బ్యాట్స్‌మన్ క్రీజులో నుంచి బయటకు వచ్చి గాల్లో ఉన్న బాల్ నేలపై పడగానే గట్టిగా కొట్టడానికి ప్రయత్నిస్తాడు. షాట్ కొట్టే ప్రయత్నంలో బాల్ నాన్-స్ట్రైకర్ బ్యాట్స్‌మన్ హెల్మెట్ కు బలంగా తాకుతుంది. అంతటితో ఆగుతారా.. ఒక పరుగు కూడా తీశారు. ఆ తర్వాత నాన్ స్ట్రైకర్ లో ఉన్న బ్యాట్స్ మెన్ దగ్గరికొచ్చి ఏదో మాట్లాడి వెళ్లిపోతాడు. ఈ క్రికెట్ ఫన్నీ వీడియో చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు.
Oh my word 😂
via @PlayCricketAU pic.twitter.com/4uoGAg68ez
— Village Cricket Moments (@villagemoments) October 30, 2023
Read Also: Mark Antony: మార్క్ ఆంటోనీ హిట్.. డైరెక్టర్ కు లగ్జరీ కార్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత