వరల్డ్ కప్ 2023లో పాకిస్తాన్ జట్టు పేలవ ఫాం కొనసాగుతుంది. అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చూపడం లేదు. ముఖ్యంగా బౌలర్ల విషయానికొస్తే.. మొదట్లో ఫామ్లో లేని షహీన్ షా అఫ్రిదీ.. రెండు మ్యాచ్ల తర్వాత పుంజుకున్నాడు. ఇక మిగతా బౌలర్లు ఫెయిల్యూరే. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ ఈ టోర్నీలో పూర్తిగా నిరాశపరిచాడు. అతని బౌలింగ్లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్స్ వీరవిహారం చేస్తున్నారు. హరీస్ రవూఫ్ బౌలింగ్‌పై వెస్టిండీస్ మాజీ ఆటగాడు శామ్యూల్ బద్రీ స్పందించాడు. ఈ ప్రపంచకప్‌లో ఫెయిల్యూర్ బౌలర్లలో హరీస్ రవూఫ్ ఒకడని శామ్యూల్ బద్రీ అన్నాడు.
Read Also: Hardik Pandya: టీమ్లో చేరుతాడు కానీ.. ఆ మ్యాచ్కు కష్టమే..!
ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్లు హరీస్ రవూఫ్ బంతుల్లో విపరీతంగా రన్స్ చేయగలుగుతున్నారని అన్నాడు. అంతేకాకుండా.. ఈ ప్రపంచకప్‌లో అతని బౌలింగ్ లో అత్యధిక సిక్సర్లు బాదారని తెలిపాడు. ఇప్పటివరకు ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్ హరీస్ రవూఫ్ బౌలింగ్ లో 14 సిక్సర్లు కొట్టారన్నాడు. ఈ టోర్నీలో హరీస్ రవూఫ్ ఫాంలో లేడని, దాంతో ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్‌లు సులభంగా పరుగులు చేస్తున్నారని పేర్కొన్నాడు.
Read Also: Shaheen Shah Afridi: పాక్ ఫాస్ట్ బౌలర్ సరికొత్త రికార్డు.. వన్డే చరిత్రలోనే..!
మరోవైపు ఈ ప్రపంచకప్‌లో బాబర్ అజామ్ సారథ్యంలోని పాక్ జట్టు ప్రదర్శన చాలా నిరాశపరిచింది. ఇప్పటివరకు పాకిస్థాన్ 6 మ్యాచ్‌లు ఆడగా.. అందులో 3 గెలిచింది, 3 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది. పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ ఏడో స్థానంలో ఉంది. ఇక.. ఈ జట్టు సెమీస్ కు వెళ్లే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. చూడాలి మరీ వరల్డ్ కప్ మ్యాచ్ ల్లో ఏమైనా మాయజాలం జరిగితే సెమీస్ కు వెళ్లొచ్చు.