Mohammed Shami: షమీ వేసిన బాల్స్ బుల్లెట్ కంటే తక్కువేమీ కాదు.. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచకప్ 2023లో మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతని బౌలింగ్ పై మాజీ క్రికెట్ దిగ్గజాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 కీలక వికెట్లు తీసి.. జట్టు విజయానికి కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్ తర్వాత.. న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ సైమన్ డౌల్ షమీపై పొగడ్తల వర్షం కురిపించాడు.
Read Also: JioPhone Prima 4G: జియో 4G ఫోన్ విడుదల.. ధర, ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..!
Also Read
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
ఐసీసీ షేర్ చేసిన వీడియోలో న్యూజిలాండ్ మాజీ వెటరన్ బౌలర్ షమీ గురించి మాట్లాడటం కనిపించింది. మహ్మద్ షమీ అంటే ఇష్టమని.. షమీకి అద్భుత ప్రదర్శన చేయడం ఇది తొలిసారి కాదన్నాడు. అతను జట్టు నుండి బయటకు వెళ్లి తిరిగి వచ్చి మళ్లీ అదే ప్రదర్శన ఇస్తాడని తెలిపాడు. అతని బౌలింగ్ శైలి అంటే ఇష్టమని చెప్పాడు. అతను బౌలింగ్ చేసే సీమ్ పొజిషన్ క్రికెట్‌లో అత్యుత్తమమైనదిగా పేర్కొన్నాడు. అతని బౌలింగ్ బుల్లెట్ అని సైమన్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అతనికి జట్టులో తిరుగులేదని.. టీమ్లో మంచి పొజిషన్ను ఉంచుకున్నాడని తెలిపాడు.
Read Also: Thailand: భారతీయులకు గుడ్‌న్యూస్.. వీసా లేకుండానే థాయ్‌లాండ్‌కు ప్రయాణించవచ్చు..
ఇదిలా ఉంటే.. ఈ ప్రపంచ కప్ మొదటి నాలుగు మ్యాచ్‌లలో.. టీమిండియా షమీని బెంచ్‌పై ఉంచింది. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం చేసింది. కానీ బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడటంతో.. జట్టులో రెండు మార్పులు చేశారు. దీంతో హార్దిక్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ స్థానంలో మహ్మద్ షమీ జట్టులోకి వచ్చాడు. టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్ కే షమీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో తన తొలి మ్యాచ్‌లో షమీ 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టు వెన్ను విరిచాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌పై షమీ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?