Shaheen Shah Afridi: పాక్ ఫాస్ట్ బౌలర్ సరికొత్త రికార్డు.. వన్డే చరిత్రలోనే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచకప్‌లో భాగంగా ఈరోజు పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే బౌలింగ్ ఎటాక్ లో దిగిన పాకిస్తాన్.. తొలి ఓవర్లోనే ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది సరికొత్త రికార్డు సృష్టించాడు. మొదటి ఓవర్ 5 బంతికి బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ తాంజిద్ హసన్ వికెట్ పడగొట్టాడు. దీంతో వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర నెలకొల్పాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ బౌలర్లలో ఇంతవరకు సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు.
Also Read
ఈ పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది 51 వన్డేల్లో 100 వికెట్లు తీశాడు. అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన జాబితాలో రెండవ ఫాస్ట్ బౌలర్ ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్, 52 వన్డే మ్యాచ్‌లలో 100 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో సందీప్ లామిచానే ఉన్నాడు. అతను కేవలం 42 వన్డే మ్యాచ్‌లలో 100 వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే అతను స్పిన్ బౌలర్. ఫాస్ట్ బౌలర్ల పరంగా మిచెల్ స్టార్క్ అగ్రస్థానంలో ఉండగా.. ఇప్పుడు షాహీన్ అతనిని అధిగమించాడు.
Bhatti Vikramarka: బీఆర్ఎస్ పాలనలో ఎంపీకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి?
ఇక 44 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లలో 100 వికెట్లు తీసిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. 51 వన్డేల్లో 100 వికెట్లు తీసిన పాకిస్థాన్‌కు చెందిన షాహీన్ షా ఆఫ్రిది మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత.. 52 వన్డే మ్యాచ్‌లలో 100 వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్ నాల్గవ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 53 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లలో 100 వికెట్లు తీసిన పాకిస్థాన్ మాజీ స్పిన్ బౌలర్ సక్లైన్ ముస్తాక్ పేరు ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉంది.
తాజావార్తలు
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్‌ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!