ప్రపంచకప్ 2023లో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. టీమిండియా ఆడిన 6 మ్యాచ్‌ల్లో గెలిచి 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. టీమిండియా రథసారధి రోహిత్ శర్మపై పాకిస్థాన్ మాజీ దిగ్గజం వసీం అక్రమ్ పొగడ్తల జల్లు కురిపించాడు. రోహిత్ శర్మ పుట్టుకతో వచ్చిన నాయకుడని వసీం అక్రమ్ అన్నారు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియాను నిలువరించడం అసాధ్యమని పేర్కొన్నాడు. భారత జట్టును ఓడించాలంటే ఇతర జట్లు ప్రత్యేకంగా ఏమైనా ప్లాన్ చేయాలన్నాడు. మరోవైపు రోహిత్ శర్మ అనుభవం టీమిండియాకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపాడు.
Read Also: Samantha: పైట పక్కకు జరిపి.. ఫొటోకు పోజ్ ఇస్తే.. కుర్రాళ్లు ఆగేనా
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ 5 సార్లు టైటిల్ గెలుచుకున్నాడని వసీం అక్రమ్ చెప్పాడు. అతను చాలా కూల్ స్వభావాన్ని కలిగి ఉంటాడని.. జట్టును ఎలా నడిపించాలో తెలుసన్నాడు. ఇది గొప్ప కెప్టెన్లకు సంకేతం, కెప్టెన్‌గా రోహిత్ శర్మ ప్రశంసనీయుడు అని చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ బౌలింగ్‌ను మార్చి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ఫీల్డ్‌ని అమర్చిన తీరు నిజంగా అద్భుతమని అన్నాడు. అంతేకాకుండా.. పిచ్ స్వభావాన్ని బట్టి బౌలింగ్, బ్యాటింగ్ ఎలా చేయాలో అనే దానిలో రోహిత్ శర్మ ప్రవీణుడు అని కొనియాడాడు.
Read Also: Nitish Kumar: “ఇండియా కూటమిలో ఊపు లేదు”.. బీహార్ సీఎం సంచలన వ్యాఖ్యలు..
రోహిత్ శర్మ తన తోటి ఆటగాళ్లతో నిరంతరం మాట్లాడుతాడని వసీం అక్రమ్ అన్నాడు. రోహిత్ శర్మ తన ఆటగాళ్లను ఎప్పుడూ చైతన్యవంతంగా ఉంచుతాడని చెప్పాడు. పరిస్థితులు ఎంత సవాలుగా ఉన్నా, రోహిత్ శర్మ తన ఆటగాళ్ల మనోధైర్యాన్ని పడనివ్వడని అన్నాడు. ఆటగాళ్లకు ఎప్పుడూ సూచనలు ఇస్తూనే ఉంటాడని.. భారత కెప్టెన్ తన వ్యూహం ప్రకారం ఆటను ముందుకు తీసుకువెళతాడని వసీం అక్రమ్ అన్నాడు.