శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సెంచరీ మిస్ అయినప్పటికీ.. అతను అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. గిల్ 92 బంతుల్లో 92 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. శుభ్‌మన్ గిల్ క్రీజులో నుంచి ముందుకొచ్చి ఆఫ్ సైడ్ అద్భుత షాట్ ఆడాడు. అది చూసి నాన్-స్ట్రైక్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు.
Read Also: Somireddy: చంద్రబాబును జైల్లో పెట్టి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు..
శుభ్‌మన్ గిల్ కొట్టిన షాట్ విరాట్ కోహ్లీని ఎంతగానో ఆకట్టుకుంది. శుభ్‌మన్ గిల్ క్రీజు నుండి బయటకు వచ్చి ఫాస్ట్ బౌలర్ మధుషంక వేసిన బౌలింగ్ లో అద్భుతమైన షాట్ కొట్టాడు. అది చూసిన నాన్‌స్ట్రైక్‌లో ఉన్న విరాట్ కోహ్లి ముఖంలో రియాక్షన్ వచ్చింది. ఏం షాట్ కొట్టావు అన్నట్టుగా రియాక్షన్ ఇచ్చాడు. అయితే అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ రియాక్షన్ పై నెటిజన్లు తమ అభిప్రాయాన్ని కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Skill Development Scam: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో కొత్త ట్విస్ట్
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో టీమిండియా శ్రీలంకకు 358 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన లంకేయలకు టీమిండియా బౌలర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఆరంభం నుంచే వికెట్లు తీశారు. దీంతో 13 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసింది.