ప్రపంచకప్ 2023లో భాగంగా ఇండియా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు పలువురు ప్రముఖులు స్టేడియంకు వచ్చారు. అందులో సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కూడా ఉంది. ఇప్పటికే టీమిండియా ఆడిన పలు మ్యాచ్లకు ఎంకరేజ్ చేయగా.. మరోసారి తళుక్కుమంది. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కెమెరామెన్ సారాను చాలాసార్లు చూపెట్టాడు. ఎందుకంటే శుభమాన్ గిల్ క్రీజులో ఉన్నాడు కాబట్టి. ఇంతకుముందు గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తెగ ఎంకరేజ్ చేసిన సారా టెండూల్కర్.. ఈసారి కూడా గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆసక్తిగా చూస్తుంది. ఆ ఫొటోను పెద్ద స్క్రీన్ పై చాలాసార్లు చూపించారు. ఇప్పుడు ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Team India: టీమిండియా బ్యాటర్ల సెంచరీలు మిస్.. మళ్లీ చేజారిన రికార్డ్
ఇదిలా ఉంటే శుభమాన్ గిల్తో సారా టెండూల్కర్ ఎఫైర్ ఏంటనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. సారా టెండూల్కర్, శుభ్‌మాన్ గిల్ కలిసి వేర్వేరు ప్రదేశాలలో చాలాసార్లు కనిపించారు. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగింది. తాజాగా ప్రపంచకప్ మ్యాచ్ల్లో గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయాల్లో సారా ఎంకరేజ్ చేయడం మరోసారి వైరల్ గా మారింది.
Read Also: Rohit Sharma: రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్.. పొగడ్తల జల్లు కురిపించిన పాక్ మాజీ క్రికెటర్
మరోవైపు.. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ కలిసి 189 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సెంచరీ అంచువరకు వచ్చి ఇద్దరు బ్యాట్స్మెన్లు సెంచరీ చేయకుండానే ఔటయ్యారు. శుభ్‌మన్ గిల్ 92 బంతుల్లో 92 పరుగులు చేయగా… విరాట్ కోహ్లీ 88 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో కోహ్లీ.. మరోసారి సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ మిస్ అయింది.
Sara Tendulkar in the stands. pic.twitter.com/pvBAUZhIAI
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2023