IND vs SL: భారత్-శ్రీలంక వన్డే చరిత్రలో రికార్డ్స్ ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2023 ప్రపంచకప్‌లో భాగంగా.. భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు 168వ మ్యాచ్. ఇప్పటి వరకు ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా 98 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. శ్రీలంక 57 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టై కాగా, 11 మ్యాచ్‌లు ఫలితం తేలలేదు. ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఇక.. వికెట్ల పరంగా ముత్తయ్య మురళీధరన్ నంబర్-1 స్థానంలో ఉన్నాడు. గత దశాబ్ద కాలంగా వీరిద్దరి రికార్డులను ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. భారత్-శ్రీలంక వన్డే చరిత్రకు సంబంధించిన టాప్ 10 గణాంకాలను తెలుసుకుందాం.
IND vs SL: తొలి ఓవర్లనే రోహిత్ శర్మ ఔట్.. నిలకడగా ఆడుతున్న బ్యాటర్లు
Also Read
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
అత్యధిక స్కోరు:
ఈ రికార్డు భారత్ పేరిట ఉంది. 2009 డిసెంబర్ 15న రాజ్‌కోట్ వన్డేలో శ్రీలంకపై భారత్ 7 వికెట్లు కోల్పోయి 414 పరుగులు చేసింది.
అత్యల్ప స్కోరు:
ఈ చెత్త రికార్డు శ్రీలంక ఖాతాలో చేరింది. 2000 అక్టోబర్ 29 న షార్జా వన్డేలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది.
అతిపెద్ద విజయం:
ఈ ఏడాది జనవరిలో శ్రీలంకపై భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. తిరువనంతపురం వన్డేలో భారత్ 317 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.
అతి చిన్న విజయం:
1993 జూలై 25న కొలంబోలో జరిగిన వన్డేలో భారత్ 1 పరుగు తేడాతో శ్రీలంకను ఓడించింది.
అత్యధిక పరుగులు:
శ్రీలంకపై భారత లెజండరీ బ్యాట్స్ మెన్ సచిన్ టెండూల్కర్ ఖాతాలో 3113 పరుగులు ఉన్నాయి.
అత్యుత్తమ ఇన్నింగ్స్:
ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. 2014 నవంబర్ 13న ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకపై హిట్‌మాన్ 264 పరుగులు చేశాడు.
అత్యధిక సెంచరీలు:
ఈ విషయంలో విరాట్ కోహ్లీ నంబర్-1 స్థానంలో ఉన్నాడు. శ్రీలంకపై విరాట్ 10 సెంచరీలు చేశాడు.
అత్యధిక వికెట్లు:
శ్రీలంక లెజెండ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ భారత్‌పై 74 వికెట్లు పడగొట్టాడు.
అత్యుత్తమ బౌలింగ్ ఇన్నింగ్స్:
ఇక్కడ కూడా మురళీధరన్ ముందంజలో ఉన్నాడు. మురళీధరన్ 2000 అక్టోబర్ 27న షార్జా వన్డేలో 30 పరుగులకు 7 వికెట్లు తీశాడు.
కీపర్ క్యాచ్, స్టంపింగ్‌లు:
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని శ్రీలంకపై 96 ఔట్‌లు చేశాడు. వీటిలో 71 క్యాచ్‌లు, 25 స్టంపింగ్‌లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
-
Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!