టీమిండియా యువ ఓపెనర్ శుభ్మాన్ గిల్ తన జెర్సీ నంబర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన జెర్సీపై జెర్సీ నంబర్ 77ని ఎలా పొందాడనే దానిపై ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. ఇటీవల స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. జెర్సీ నంబర్ 77ని పొందడం, దానితో ఎలా ఆడుతున్నాడనే దాని గురించి వెల్లడించాడు. తన లక్కీ నంబర్ 7 అని.. ఆ నెంబర్ కావాలని అడిగానని, అయితే అది రాలేదని శుభ్‌మాన్ చెప్పాడు. అందుకే దానికి మరో 7 జోడించి 77 మార్చుకున్నానని తెలిపాడు.
అండర్ 19 వరల్డ్ కప్ లో ఆడుతున్న సమయంలో జెర్సీ నెంబర్ ఏడు కోసం ఎంతగానో ట్రై చేశానని గిల్ తెలిపాడు. కానీ ఆ జెర్సీ నెంబర్ అందుబాటులో లేకపోవడంతో తన జెర్సీ నెంబర్ ను 77 గా మార్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అంతకుముందు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 7 జర్సీనే ధరించాడు. 7 నెంబర్ జెర్సీ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు తెలిసిన క్రికెటర్. అయితే ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, గిల్ 7 నెంబర్ జెర్సీని ధరించవచ్చు.
Read Also: Duet: చిన్న కొండన్న.. ఇది కూడా నిబ్బా నిబ్బి లవ్ స్టోరీనేనా..?
ఇదిలా ఉంటే.. చాలా విషయాలను శుభ్ మాన్ గిల్ పంచుకున్నారు. తన ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అని.. టీమిండియాలో తన బెస్ట్ ఫ్రెండ్ ఇషాన్ కిషన్ అని చెప్పుకొచ్చాడు. ఇక జట్టులో తన నిక్ నేమ్ కాక అని అన్నాడు. దాని అర్ధం పంజాబీలో బేబీ అని అర్థం వస్తుంది అంటూ పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.