వన్డే ప్రపంచకప్-2023లో ఆఫ్గానిస్తాన్ మరో విక్టరీ సాధించింది. లక్నో వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆఫ్గాన్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 179 పరుగులు చేసింది. ఈ క్రమంలో 180 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్ 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అఫ్గాన్ బ్యాటర్లలో కెప్టెన్ షాహిదీ 56 నాటౌట్ పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రెహమత్ షా 52 పరుగులతో రాణించాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ 31, ఇబ్రహీం జర్దాన్ 20, గుర్బాజ్ 10 పరుగులు చేశారు.
ఈ ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌కు ఇది వరుసగా మూడో విజయం. అంతకుముందు పాకిస్తాన్, శ్రీలంకను ఓడించింది. ఈ విజయంతో ఆఫ్గానిస్తాన్.. పాకిస్తాన్ వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి చేరింది. ఇదిలా ఉంటే.. నెదర్లాండ్ బౌలర్లలో వాన్‌బీక్, జుల్ఫికర్, వాండర్ మెర్వ్ తలా వికెట్ సాధించారు.
Read Also: IPL 2024 Auction: వీడిన సస్పెన్స్.. దుబాయ్లోనే ఐపీఎల్ వేలం పాట..!
మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్.. 46.3ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఆఫ్ఘాన్ ఫీల్డింగ్ ప్రదర్శనతో డచ్ బ్యాటర్లలో నలుగురు రనౌట్లు అయ్యారు. ఇక ఆఫ్గనిస్తాన్ బౌలింగ్ లో నబీ మూడు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్ రెండు, ముజీబ్ ఒక్క వికెట్ సాధించాడు. నెదర్లాండ్స్ బ్యాటర్లలో సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్(58) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.