ప్రపంచకప్‌లో భారత్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో చెత్త రికార్డు నమోదైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. భారత్ నిర్దేశించిన ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక జట్టు ఘోర పరాజయం పొందింది. తొలి బంతికే ఓపెనర్లిద్దరూ ఔటయ్యారు. శ్రీలంక జట్టు వికెట్ల పతనం అక్కడి నుంచి ప్రారంభమైంది. కేవలం 3 పరుగుల స్కోరుకే 4 వికెట్లు కోల్పోయింది. అందులో 2 పరుగులు ఎక్స్‌ట్రాలు కాగా.. ఒక పరుగు మాత్రమే బ్యాట్‌తో వచ్చింది. అయితే చెత్త రికార్డులు చూసుకుంటే.. చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Brain Stroke: బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసా?
2015లో వెస్టిండీస్‌పై కేవలం 1 పరుగు చేసి 4 వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ పేరు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఈరోజు జరిగిన మ్యాచ్ లో శ్రీలంక ఒక్క పరుగు చేసి టాప్ నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంక జట్టు ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. 2007లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 2 పరుగులకే టాప్ 4 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ మూడో స్థానంలో ఉంది. 1993లో వెస్టిండీస్‌పై కేవలం 3 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు పేరు మరోసారి నాలుగో స్థానంలో ఉంది. అంతేకాకుండా.. 2018లో ఆస్ట్రేలియాపై కేవలం 3 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు ఐదవ స్థానంలో ఉంది.
Elon Musk: ఎలాన్ మస్క్ కొడుకు పేరులో ‘చంద్రశేఖర్’..
ఇండియా-శ్రీలంక మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక జట్టు కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయి 302 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది అతిపెద్ద విజయం కాగా.. ప్రపంచకప్ చరిత్రలో రెండవ అతిపెద్ద విజయంగా నిలిచింది.