నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం..
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న కేబినెట్ సమావేశ మందిరంలో ఈ సమావేశం కానుంది కేబినెట్.. పలు కీలక అంశాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గ సమావేశం.. సుమారు 19 వేల కోట్ల రూపాయాల విలువైన పారిశ్రామిక పెట్టుబడులకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.. విశాఖలో ట్రాన్సిట్ అకామిడేషన్ కమిటీ నివేదికపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్ కల్యాణ మస్తు – షాది తోఫా మూడో విడత, జగనన్న విద్యా దీవెన మూడో విడతకు కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఖాళీల భర్తీ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటన, బాధితులకు ప్రభుత్వ పరిహారం, జగనన్న ఆరోగ్య సురక్షా తదితర అంశాల పై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. నేటి నుంచి అసలుసిసలైన ఆట షురూ..
కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది.. దీంతో.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసినట్టు అవుతుంది.. ఇక, ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 10 వరకు అభ్యర్థులు ప్రతి రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఈనెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపట్టనుండగా.. 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువుగా నిర్ణయించారు. ఇక, ఈనెల 30న పోలింగ్ నిర్వహించనుండగా.. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్, ఎన్నికల ఫలితాల ప్రకటన ఉండనుంది. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని ఈసీ స్పష్టం చేసింది. ఒక్కో అభ్యర్థి ఒక్కో నియోజకవర్గం నుంచి గరిష్ఠంగా నాలుగుసెట్ల నామినేషన్లు వేయవచ్చు. ఒక అభ్యర్థి రెండుకు మించి నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అవకాశం లేదు. నామినేషన్ల దాఖలులో ఆర్వో, ఏఆర్వో కార్యాలయం సమీపంలోని వంద మీటర్ల పరిధిలోకి మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.
కటీఫ్ చెప్పిన సీపీఎం.. ఇక, సీపీఐ వంతు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల వ్యవహారం కాక రేపుతోంది.. బీఆర్ఎస్ ఒంటరిగా బరిలోకి దిగగా.. బీజేపీ-జనసేన కలిసి వెళ్లాలని నిర్ణయించాయి.. అయితే, జనసేన సీట్ల వ్యవహారం తేలాల్సి ఉంది.. మరోవైపు.. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం ఆది నుంచి జరుగుతూనే ఉంది.. దీని కోసం కమ్యూనిస్టులతో కాంగ్రెస్ నేతలు చర్చలు కూడా జరుపుతూ వచ్చారు.. కానీ, సాగదీత దోరణితో విసుగుచెందిన సీపీఎం.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. 17 చోట్ల పోటీకి సిద్దమని ప్రకటించింది. ఇక సీపీఎం బాటలోనే సీపీఐ కూడా వెళ్లే అవకాశముంది. ఇవాళ జరగనున్న సీపీఐ రాష్ట్ర కమిటీ సమావేశంలో కాంగ్రెస్‌తో పొత్తుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. సీపీఐకి కొత్తగూడెం సీటు ఆఫర్ చేసింది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్‌ను నమ్మలేమంటున్నారు సీపీఐ నేతలు. మరోవైపు, కాంగ్రెస్‌తో కలిసి సీపీఐ పోటీ చేస్తే.. అక్కడ తమ అభ్యర్థిని పోటీకి పెట్టబోమని సీపీఎం తెలిపింది. అలాగే వామపక్షాలు పోటీ లేని స్థానాల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని ప్రకటించింది సీపీఎం. మిర్యాలగూడ, వైరా అసెంబ్లీ సీట్లు ఇస్తామని చెప్పి.. కాంగ్రెస్ హ్యాండివ్వడంతో పొత్తుపై వెనక్కి తగ్గింది సీపీఎం. పైగా కాంగ్రెస్ నేతలు అవమానకరంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. 17 చోట్ల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు కమ్యూనిస్టు పార్టీల నేతలు. మొదట్లో ఐదు స్థానాలను ఆశించిన సీపీఎం.. తగ్గుతూ వచ్చింది. కనీసం రెండు చోట్లయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. పాలేరు సీటు తమకు వదిలేయాని కాంగ్రెస్‌ను కోరారు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం. అయితే మిర్యాలగూడ, వైరా సీట్లను ఇస్తామని హామీ ఇచ్చి మాట మార్చారు కాంగ్రెస్ నేతలు. మిర్యాలగూడ లేదా హైదరాబాద్‌లో ఏదో ఒకచోటు నుంచే పోటీ చేయాలని సూచించడంతో పొత్తు ప్రయత్నాలను విరమించుకున్నారు.
నేటి నుంచే పోస్టల్ ఓటుకు దరఖాస్తు.. వారికి మాత్రమే అవకాశం..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. శుక్రవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. పోలింగ్ ప్రక్రియ మొత్తం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) ద్వారానే నిర్వహించనున్నారు. ఇంటి వద్ద ఓటు వేసే వారి కోసం తయారు చేసిన పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ పేపర్ పింక్ కలర్‌లో ఉంటాయి. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లను ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలి మరియు దరఖాస్తును భౌతికంగా రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. రాష్ట్రంలోనే తొలిసారిగా వికలాంగులు, 80 ఏళ్లు పైబడిన వారందరికీ ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది. అయితే ఇంటి వద్దకే ఓటు వేయాలనుకునే వారు ఈ నెల 7వ తేదీలోగా బూత్ లెవల్ అధికారి (బీఎల్‌వో)కి ’12డీ’ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వారికి మాత్రమే ఈ సౌకర్యం ఉంది. వీరితో పాటు అత్యవసర సేవలు అందిస్తున్న 13 శాఖల సిబ్బంది, ఉద్యోగులు, అధికారులకు పోస్టల్ ఓటింగ్ సౌకర్యం కల్పించారు. ఆయా శాఖల నోడల్ అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వీరితో పాటు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, అధికారులు, సిబ్బందికి కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. అయితే గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరికీ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడంతో వారంతా అక్కడే ఓటు వేయాల్సి ఉంటుంది. ఈసారి 13 లక్షల మందికి పైగా పోస్టల్ ఓటు హక్కును వినియోగించుకుని ఇంటి వద్దే ఓటు వేసేందుకు అర్హులు.
రుణమాఫీ చేయలేకపోతున్నా.. రైతులను ఉద్దేశించి కేసీఆర్ కీలక ప్రకటన
తెలంగాణ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో రైతులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటికే పలు సందర్భాల్లో రైతుల రుణాలను మాఫీ చేసింది. ఈ క్రమంలో.. ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. దీంతో ప్రభుత్వ పథకాల్లో ఒకటైన రైతు రుణమాఫీకి బ్రేక్ పడింది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న కేసీఆర్ ఈరోజు ఆయన పాల్గొన్న నిర్మల్ ప్రజా ఆశీర్వాద సభలో రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న విధంగా ప్రతి ఒక్కరికీ సకాలంలో రుణమాఫీ చేయలేకపోతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. అలాగే కొంతమంది రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆగిపోయిందని కేసీఆర్ వివరించారు. దీనిపై కాంగ్రెస్ కూడా పిటిషన్ వేసిందని కేసీఆర్ తెలిపారు. ఇదిలా ఉండగా, ఎన్నికలలోగానీ, ఆ తర్వాత గానీ అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం అనుమతి ఇస్తే వారం పది రోజుల్లో వస్తుందని కూడా చెప్పారు. లేకుంటే పోలింగ్ ఏజెంట్ల ఖాతాల్లో డబ్బులు వేస్తామని కేసీఆర్ చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు రెండు దఫాలుగా ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది. ఇందుకోసం రూ. 37 వేల కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. లక్ష వరకు రుణమాఫీని అనేక దశల్లో అమలు చేయగా, లక్ష కంటే కొంచెం ఎక్కువ రుణాలు తీసుకున్న వారి రికార్డులు పూర్తిగా నిలిచిపోయాయి. వారందరి వివరాలను ప్రభుత్వం తీసుకుంది. ఇదిలా ఉండగా.. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో దాన్ని నిలిపివేశారు.. కాంగ్రెస్ నేతలు చేసిన ఫిర్యాదుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే రైతుల వివరాలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయి.
తమిళనాడులో దారుణం.. కూతురు వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని..!
తమిళనాడులోని తూత్తుకూడి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుందన్న ఆగ్రహంతో.. సొంత కుటుంబ సభ్యులే ఓ యువతి, యువకుడిని దారుణంగా చంపారు. నిద్రిస్తున్న సమయంలో ఇంటిలోకి చొరబడిన యువకులు.. కొత్త జంటను దారుణంగా చంపేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు దీనిని పరువు హత్యగా భావిస్తున్నారు. తూత్తుకూడికి చెందిన కార్తీక (20), సేల్వం (24) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కలిసి జీవించాలుకున్న వారు.. పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయం తల్లిదండ్రులు చెబితే.. కార్తీక కుటుంబ సభ్యులు ఓప్పుకోలేదు. ఒకరినివిడిచి మరొకరు ఉండలేని వారు.. అక్టోబరు 31న ఇంటి నుండి వెళ్లిపోయారు. కార్తీక, సేల్వం మూడురోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లయినప్పటి నుంచి మురుగేషన్ నగర్‌లో వారు ఉంటున్నారు. కూతురు వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని కార్తీక కుటుంబసభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. కొత్త జంట కార్తీక, సేల్వం తూత్తుకూడిలో ఇంట్లో నిద్రిస్తన్న సమయంలో ఆరుగురు యువకులు లోపలి చొరబడ్డారు. కార్తీక, సేల్వంన దారుణంగా చంపి పరారీ అయ్యారు. విషయం తెలిసిన సేల్వం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నారు అయ్యారు.
నిమిషానికి మూడు.. ఒక్కరోజులో 4000వేల చలాన్లు వేసిన నోయిడా పోలీసులు
మన దేశంలో గంటకు 53 ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాలలో గంటకు 19 మంది మరణిస్తున్నారు. పెరుగుతున్న ఈ ప్రమాదాలను తగ్గించేందుకు, భద్రతపై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వివారాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లో ప్రతి సంవత్సరం నవంబర్‌లో ట్రాఫిక్‌పై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపడతారు. ఈ ఏడాదిలో కూడా భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారి పైన భారీ మొత్తంలో చలానా విధించబడుతుంది ప్రచారం చేశారు. ఈ క్రమంలో గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీసులు గురువారం నోయిడా, గ్రేటర్ నోయిడాలో నిబంధనలను ఉల్లంఘించిన ప్రయాణికులపై 4,000 కంటే ఎక్కువ చలాన్లు అంటే నిమిషానికి సగటున 2.7 చలాన్లు జారీ చేయబడ్డాయి. అలానే డజనుకు పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీలో విషపూరితంగా మారిన గాలి.. రెండు రోజుల పాటు స్కూల్స్ బంద్
దేశ రాజధాని ఢిల్లీ వాతావరణం రోజురోజుకూ విషమంగా మారుతోంది. గురువారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రాథమిక పాఠశాలలకు రెండ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. వాయుకాలుష్యం నుంచి కాపాడుకునేందుకు వైద్యులు కూడా ప్రజలకు సలహాలు ఇస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాజధానిలో కాలుష్యం స్థాయి 350 దాటిందని.. అందుకే గాలిలో కొన్ని రేణువులు కనిపిస్తున్నాయని.. అంతేకాకుండా గాలిలో విషవాయువులు కూడా ఉన్నాయని తెలిపారు. వాయుకాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాల గురించి వైద్యులు ప్రస్తావిస్తూ.. “ఈ కాలుష్యం అనేక వ్యాధులకు కారణమవుతోంది. ఇది వేగంగా శ్వాసనాళాల రూపంలో ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. పెరుగుతున్న వాయు కాలుష్యం ‘క్రానిక్ బ్రాంకైటిస్’కి దారి తీస్తుంది. కేసులు కూడా క్రమక్రమంగా పెరగడం ప్రారంభిస్తాయి” అన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీలో మెట్రో లేదా ఇతర ప్రజా రవాణాను ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. క్రానిక్ బ్రోన్కైటిస్ అనేది ఊపిరితిత్తులకు సోకే వ్యాధి. ఈ సందర్భంలో ప్రజలకు తీవ్రమైన దగ్గు ప్రారంభమవుతుంది.
స్పామ్ కాల్స్ విసిగిస్తున్నాయా? ఇలా చేస్తే కాల్స్ రావు..
ఫోన్లకు మనకు అవసమైన కాల్స్ వస్తాయో లేదో కానీ స్పామ్ కాల్స్ మాత్రం గంటకు నాలుగు ఐదు కాల్స్ వస్తాయి.. ఎంత బిజీగా ఉన్న ఈ ఫోన్ కాక్స్ విసిగిస్తూనే ఉంటాయి.. వీటికి ఎంతగా బ్లాక్ చేసినా మళ్లీ మళ్లీ కొత్త నెంబర్స్ నుంచి వస్తూనే ఉంటాయి.. లోన్ తీసుకుంటారా.. కొత్త స్కూటీ కొంటారా.. అది ఇది అని కస్టమర్ కేర్ నుంచి కాల్స్ వస్తూనే ఉంటాయి.. కొంతమంది విసుగు వచ్చి ఫోన్ ను పక్కనే పడేస్తుంటారు.. దిగులు పడకండి అలాంటి వారికోసం సింపుల్ టిప్స్.. ఇలాంటి చేస్తే ఇక అలాంటి కాల్స్ కు చెక్ పెట్టవచ్చు. అవేంటో ఒక్కసారి చూసేద్దాం.. మెసేజ్ ల ద్వారా వీటికి చెక్ పెట్టవచ్చు.. ఎలాగంటే? ఫోన్‌లోని మెసేజ్ ఓపెన్ చేసి. 1909 నెంబర్‌కి ‘బ్లాక్’ అనే మెసేజ్ పంపించాలి. వెంటనే మీకు మరో మెసేజ్ వస్తుంది. అందులో మీ పర్సనల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి, ఎలాంటి రకం కాల్స్ వద్దనుకుంటున్నారో సమాచారం అందించాలి. దీంతో 24 గంటల్లో స్పామ్ కాల్స్ నిలిపివేస్తారు..
మా మొదటి లక్ష్యం నెరవేరింది.. ఇక ముందుంది అసలు పండగ: రోహిత్
వన్డే ప్రపంచకప్ 2023లో అధికారికంగా సెమీఫైనల్‌కు అర్హత సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తమ మొదటి లక్ష్యం నెరవేరిందని, ఇక సెమీస్ మరియు ఫైనల్స్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతామన్నాడు. ఏడు మ్యాచ్‌ల్లో గొప్పగా ఆడామని, భారత్ విజయాల్లో ప్రతి ఆటగాడి పాత్ర ఉందని రోహిత్ చెప్పాడు. ముంబైలో గురువారం శ్రీలంకను ఏకంగా 302 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్ అందరికంటే ముందుగా సెమీస్‌లోకి దూసుకెళ్లింది. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘అధికారికంగా సెమీఫైనల్‌కు అర్హత సాధించినందుకు సంతోషంగా ఉంది. మేము చెన్నైలో టోర్నీ ప్రారంభించినప్పుడు మా లక్ష్యం సెమీస్ మాత్రమే. ఇప్పుడు అది నెరవేరింది. ఇక మా లక్ష్యం ఫైనల్స్. మేం గెలిచిన ఏడు మ్యాచ్‌ల్లో ఆడిన విధానం బిన్నం. ప్రతి ఒక్కరూ జట్టు కోసం కృషి చేశారు. అందరూ భారత్ విజయాలలో పాలుపంచుకుంటున్నారు. స్కోర్ బోర్డుపై భారీగా పరుగులు ఉంచడం ఎప్పుడూ సవాలే. భారీ పరుగులు చేయాలనుకున్నాడు టెంప్లేట్ ఉండాలి. ఏదైనా పిచ్‌లో 350 చాలా మంచి స్కోరు. ఈ మ్యాచ్‌లో 357 పరుగులు చేశామంటే బ్యాటింగ్ యూనిట్‌కు చాలా క్రెడిట్ ఇవ్వాలి. ఆపై బౌలర్లు పని పూర్తిచేశారు’ అని అన్నాడు.
నన్ను అలానే బయటకు పంపారు.. అంత భయమా.. పల్లవి ప్రశాంత్ పేరు లాగుతూ సందీప్ సంచలనం!
తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సందీప్ సంచలనం రేపే పోస్టు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. ఇంటి సభ్యులను బిగ్ బాస్ రెండుగా విభజించి యావర్, గౌతమ్, తేజ, శోభా శెట్టి, రతికలను ఒక టీంగా శివాజీ, అర్జున్, ప్రియాంక, పల్లవి ప్రశాంత్, అశ్వినిలను మరొక టీమ్ గా చేశారు. ఇలా టీమ్స్ ను విభజించిన తరువాత జంపింగ్ జపాంగ్ టాస్క్ లో యావర్ టీమ్ గెలిచింది. దీంతో బిగ్ బాస్ ఆ టీమ్ కి ఒక అవకాశం ఇచ్చి ఎదురు టీమ్ నుండి ఒకరిని డెడ్ చేయవచ్చనేలా రూల్ పెట్టాడు. అలా డెడ్ చేసిన సభ్యులు టాస్క్స్ ఆడటానికి లేదన్న మాట. ఈ క్రమంలో గౌతమ్ ప్రత్యర్థి టీమ్ నుండి ప్రశాంత్ ని డెడ్ చేశాడు. దీంతో పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ టాస్క్స్ ముగిసే వరకు డెడ్ బోర్డు మెడలో వేసుకుని తిరగాల్సిందేనన్నమాట. ఇప్పుడు కెప్టెన్ అయ్యే ఛాన్స్ కూడా అతనికి లేడు. ఈ క్రమంలో సందీప్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇంస్టాగ్రామ్ లో స్టోరీ పెట్టి ఓ కామెంట్ పోస్ట్ చేశాడు. పాపంరా పల్లవి ప్రశాంత్, ఒక మంచి ప్లేయర్, వాడిని ఎందుకు డెడ్ చేశారు??. ప్రశాంత్ ఉంటే ఆట ఆడలేరా? భయమా? స్ట్రాంగ్ ప్లేయర్స్ తో ఆడండి, స్ట్రాంగ్ ప్లేయర్స్ ని బయటకు పంపి ఆడితే కిక్కు ఉండదు, అఫ్ కోర్స్ నన్ను కూడా అందుకే బయటకు పంపారు నేను స్ట్రాంగ్ ప్లేయర్ అని అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు. సందీప్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన ఎలిమినేషన్ పట్ల అసంతృప్తిగా ఉన్న సందీప్ తన కామెంట్లతో మరో మారు తన బాధను వెళ్లగక్కినట్టు అయింది.
రతిక వర్సెస్ అమర్..అలాంటి మాటలతో మాటల యుద్ధం..
తెలుగు సీజన్ 7 బిగ్ బాస్ షో ప్రస్తుతం రచ్చగా మారింది.. తొమ్మిదో వారంకు గాను కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. ఇంటి సభ్యులను బిగ్ బాస్ రెండు టీమ్స్ గా విభజించాడు. వీర సింహాలు టీమ్ లో రతిక, గౌతమ్, శోభా, భోలే, యావర్, తేజ ఉన్నారు.. అలాగే గర్జించే పులులు టీమ్ లో శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక, అశ్విని, అర్జున్, అమర్ ఉన్నారు. వీరు వాటిని పైపు నుండి పడే బంతులను సేకరించాలి. ఇరు టీమ్ సభ్యులు సంచుల్లో వాటిని నింపి ప్రత్యర్థుల నుండి కాపాడుకోవాలి.. ఇలా ఎవరైతే చివరి వరకు నిలుస్తారో వారే ఈ వారం కెప్టెన్.. ఇకపోతే జంపింగ్ జపాంగ్ టాస్క్ లో వీర సింహాలు టీమ్ గెలిచింది. దాంతో గర్జించే పులులు టీమ్ నుండి ఒకరిని తప్పించే ఛాన్స్ వారికి దక్కింది. వారు పల్లవి ప్రశాంత్ ని తప్పించారు. గర్జించే పులులు టీమ్ వీక్ అయ్యింది. నేటి ఎపిసోడ్లో మరలా బంతులు పడ్డాయి. సేకరించించేకు ఇరు టీమ్స్ కి సంచులు కావాల్సి వచ్చాయి. ముందుగా స్టోర్ రూమ్ లోకి వెళ్లిన అమర్ ప్రత్యర్థి టీమ్ సంచులు కూడా తీసుకున్నాడు. గౌతమ్ వాటిని తిప్పికొట్టాడు.. ఈ సంచుల విషయంలో రతిక-అమర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాసేపు వీరి గొడవతో హౌస్ లో వేడి వాతావరణం నెలకొంది.. ఇద్దరికీ ఇద్దరే.. నువ్వా, నేనా అని మాటలతో పెద్ద యుద్ధమే జరిగింది.. సంచులు కింద పడేయ్యడం పై రతికా, అమర్ ను నిలదీసింది.. అది నా ఇష్టం నా స్ట్రాటజీ అన్నాడు. ఎదవ పని చేసి స్ట్రాటజీ అనకు అని రతిక అన్నది. నువ్వు చేసేవి ఎదవ పనులు, నువ్వంటే ఊస్తున్నారు బయట అని అమర్ అన్నాడు. మాటలు జాగ్రత్తగా రానీ అని రతిక హెచ్చరించింది. అమర్ కూడా తగ్గలేదు. ఇద్దరి మధ్య గొడవ పర్సనల్ వరకూ వెళ్ళింది.. మొత్తానికి ఆ టాస్క్ ను పూర్తి చేశారు.. మరి ఈరోజు బిగ్ బాస్ ఎలాంటి టాస్క్ ను ఇస్తాడో చూడాలి..