IPL 2024 Auction: ఇప్పుడు క్రికెట్ ప్రపంచమంతా వన్డే వరల్డ్ కప్ను ఎంజాయ్ చేస్తున్నారు. వరల్డ్ కప్ ముగియగానే ఐపీఎల్ కోసం ఎదురుచూస్తారు. అయితే దానికోసం ఐపీఎల్ 2024 కోసం ఫ్రాంచైజీలు సన్నాహాలు ప్రారంభించాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2024 వేలం డిసెంబర్ 19న దుబాయ్లో జరుగనున్నట్లు బీసీసీఐ తెలిపింది. కాగా.. ఈనెల 26లోగా ఫ్రాంచైజీలు తాము విడుదల చేసిన, తమ వద్ద ఉంచుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించవల్సి ఉంటుంది. ఇంతకుముందు నవంబర్ 15న జాబితా సమర్పించవల్సి ఉంటుందని చెప్పగా.. ప్రపంచకప్ జరుగుతుండటంతో పొడిగించారు.
Read Also: Hi Nanna : థర్డ్ సింగిల్ రిలీజ్ టైం ఫిక్స్ చేసిన మేకర్స్..
ఇదిలా ఉంటే.. డిసెంబర్లోనే టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఆ సమయంలో.. వేలంపాటలో ఏ జట్టు ఏ ఆటగాడిని తీసుకుంటుందో చూడాలి. డిసెంబర్‌లో జరిగే వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసే పది ఐపీఎల్ జట్లలో ఏ జట్టు పర్స్‌లో ఎంత డబ్బు మిగిలి ఉందో తెలుసుకుందాం.
Read Also: Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై యూఏఈ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోడీ..
పంజాబ్ కింగ్స్: ₹12.20 కోట్లు
ముంబై ఇండియన్స్: ₹50 లక్షలు
సన్‌రైజర్స్ హైదరాబాద్: ₹6.55 కోట్లు
గుజరాత్ టైటాన్స్: ₹4.45 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్: ₹4.45 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్: ₹3.55 కోట్లు
రాజస్థాన్ రాయల్స్: ₹3.35 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ₹1.75 కోట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్: ₹1.65 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్: ₹1.5 కోట్లు