ఆస్ట్రేలియాపై ఆఫ్గాన్ బ్యాట్స్‌మెన్ ఇబ్రహీం జద్రాన్ అద్భుత సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఇబ్రహీం జద్రాన్ 131 బంతుల్లో సెంచరీ మార్కును తాకాడు. ఈ ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా ఇబ్రహీం జద్రాన్ నిలిచాడు. 143 బంతుల్లో 129 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇదిలా ఉంటే.. తాజా వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఏ బ్యాట్స్‌మెన్ సెంచరీ సాధించలేదు.
ఐసీసీ ప్రతి నెలా ప్రకటించే ప్రతిష్టాత్మక ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం పోటీ పడే వారిలో ఈ వరల్డ్‌కప్‌లో ఆడే ఆటగాళ్లు ఉన్నారు. అక్టోబర్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్‌గా ఇండియా తరుఫున జస్ప్రీత్ బుమ్రా, సౌతాఫ్రికాకు చెందిన క్వింటన్ డికాక్, న్యూజిలాండ్ కు చెందిన రచిన్ రవీంద్ర ప్రకటించబడ్డారు.
ఇటీవలే టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తన ఇంట్లో ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్ల కోసం ఓ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో హర్భజన్ సింగ్, అద్నాన్ సమీ, ప్రముఖ నటుడు సునీల్ శెట్టి వంటి ప్రముఖులు పాల్గొన్నారు. అందుకు సంబంధించి.. అద్నాన్ సమీ X (ట్విట్టర్)లో ఒక ఫోటోను షేర్ చేశారు.
వరల్డ్ కప్ 2023లో భాగంగా ఢిల్లీలో బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంకను ఓడించి బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో బంగ్లాదేశ్ తొలిసారిగా శ్రీలంకను ఓడించింది. బంగ్లా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.
శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్ లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సమర విక్రమ ఔట్ తర్వాత క్రీజులోకి వచ్చిన మాథ్యూస్.. టైం ఔట్ కారణంగా బ్యాటింగ్ చేయకుండానే ఔట్ అయ్యాడు. మాథ్యూస్ హెల్మెట్ క్లిప్ ఊడిపోవడంతో మరో హెల్మెట్ తెప్పించుకునేందుకు కొంత సమయం తీసుకున్నాడు. అయితే అప్పటికే టైం అయిపోతుందని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అప్పీల్ చేశాడు. దీంతో టైమ్ ఔట్ కారణంగా బ్యాటింగ్ చేయకుండానే వెళ్లిపోయాడు. అయితే బంగ్లాదేశ్ తన అప్పీల్ ని వెనక్కి తీసుకుంటే మాథ్యూస్…
వరల్డ్ కప్ 2023లో భాగంగా.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 243 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ బౌలర్లు విజృంభించడంతో కేవలం 27.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లలో అత్యధికంగా రవీంద్ర జడేజా 5 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా ఆటగాళ్లను కోలుకోలేని దెబ్బ తీశాడు.
సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును సమం చేయడంపై విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. కల నెరవేరిందన్నాడు. భారత్ తరఫున ఆడే ప్రతి అవకాశం తనకు చాలా పెద్దదని తెలిపాడు. తన పుట్టినరోజున ప్రేక్షకుల ముందు ఈ రికార్డు నెలకొల్పడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించే అవకాశమిచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపాడు.