ravi shastri comments on test cricket: ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో టీ20 ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌లు పెరిగిపోతున్నాయి. దీంతో టెస్ట్ క్రికెట్‌పై అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోతోందని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టెస్ట్ క్రికెట్ నాణ్యత పెంచడానికి జట్ల సంఖ్యను ఐసీసీ తగ్గించాలని రవిశాస్త్రి డిమాండ్ చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో ఆరు జట్లు మాత్రమే ఉండాలన్నాడు. టెస్టు క్రికెట్ నాణ్యత కోల్పోతే క్రికెట్‌పై అభిమానులకు ఆసక్తి తగ్గిపోతుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. తద్వారా ప్రసారహక్కులు యజమాన్యాలు విముఖుత చూపే పరిస్థితి దాపరిస్తుందని తెలిపాడు. అటు అనేక దేశాల్లో పుట్ బాల్ లీగ్‌ల మాదిరి క్రికెట్ లీగులు పుట్టుకురావవడంపై రవిశాస్త్రి ఆందోళన వ్యక్తం చేశాడు. భవిష్యత్‌లో పరిస్థితి ఇలానే కొనసాగితే.. అది ప్రపంచకప్ నిర్వహించేందుకు దారితీసే అవకాశాలు లేకపోలేదన్నాడు. తన దృష్టిలో టెస్ట్ హోదాతో శాశ్వత జట్లు ఉండవని.. ఆరు అత్యుత్తమ జట్లు మాత్రమే ఉంటాయన్నాడు.
Read Also: National Film Awards: జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ తెచ్చే తెలుగు హీరో ఎవరు!?
మరోవైపు వన్డే క్రికెట్ చావు అంచుల్లో ఉందని ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా ఆరోపించాడు. వన్డే ఫార్మాట్ అనేది అన్ని ఫార్మాట్లలో మూడో ర్యాంకు ఫార్మాట్ అని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ కప్ తప్ప మిగతా వన్డే క్రికెట్లో పెద్దగా ఫన్ ఏముండదని తెలిపాడు. ఒక ఆటగాడు ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా ఉండటం ఎంతో కష్టమని.. ఆడితే అసాధ్యమేమీ కాదని ఖవాజా పేర్కొన్నాడు. అన్ని ఫార్మాట్లు ఆడే ఆటగాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారని.. అయితే వాళ్లు మానసికంగా, శారీరకంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఖవాజా తెలిపాడు.