ఫామ్ కోసం తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీని జట్టు నుంచి తప్పించాలంటూ మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాజాగా కపిల్ దేవ్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కౌంటర్ ఇచ్చాడు. డ్రెస్సింగ్ రూంలో ఏం జరుగుతుందో కపిల్ దేవ్‌కు తెలియదన్నాడు. ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉన్నా డ్రెస్సింగ్ రూంలో ఒకరికి ఒకరం మద్దతు ఇచ్చుకుంటామని.. ఒక ఆటగాడి సామర్థ్యం తెలుసుకుని అతడికి అండగా నిలుస్తామని రోహిత్ స్పష్టం చేశాడు. ఫామ్…
నాటింగ్‌హామ్ వేదికగా టీమిండియాతో జరిగిన నామమాత్రపు మూడో టీ20లో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 216 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేసింది. ఓ దశలో ఓడిపోతుందని అభిమానులు భావించారు. అయితే భారత శిబిరంలో సూర్యకుమార్ ఆశలు రేకెత్తించాడు. అతడు ఇంగ్లండ్ బౌలర్లను చీల్చి చెండాడి మెరుపు సెంచరీ చేశాడు. 55 బంతుల్లో 14 ఫోర్లు, ఆరు సిక్సర్ల సహాయంతో 117 పరుగులు చేసి…
నాటింగ్ హామ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఓపెనర్లు బట్లర్ (18), జాసన్ రాయ్ (27) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీళ్లిద్దరూ అవుటైనా డేవిడ్ మలన్ (77), లివింగ్‌స్టోన్ (42 నాటౌట్) ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. దీంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్,…
టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీపై మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొంతకాలంగా పరుగులు చేసేందుకు ఇబ్బందులు పడుతున్న కోహ్లీని టీ20ల నుంచి తప్పించాలని సెలక్టర్లకు కపిల్ దేవ్ సూచించాడు. అశ్విన్ వంటి మేటి బౌలర్‌నే తప్పించినప్పుడు కోహ్లీని ఎందుకు పక్కనబెట్టరని ప్రశ్నించాడు. అశ్విన్ టెస్టుల్లో వరల్డ్ నంబర్ 2 ఆటగాడు అని… అలాంటి ఆటగాడినే పక్కనపెట్టారని.. కోహ్లీకి కూడా ఇదే పరిస్థితి వస్తుందని కపిల్ జోస్యం చెప్పాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ…
గురువారం నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ సన్నాహాల కోసం ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులోకి రానున్నాడు. ఇటీవల కరోనా బారిన పడిన అతడు కోలుకుని రెండు రోజుల కిందటే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. దీంతో టీ20 సిరీస్‌లో అతడు బరిలోకి దిగడం ఖాయమైంది. రేపటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండటంతో రోహిత్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడాడు.…
ఈనెల 22 నుంచి టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ మేరకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు పాల్గొంటుంది. ఈ పర్యటనకు తాజాగా టీమిండియాను సెలక్టర్లు ప్రకటించారు. ఈ సిరీస్‌కు అగ్రశ్రేణి ఆటగాళ్లకు విశ్రాంతి కల్పి్ంచారు. త్వరలో ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఆటగాళ్లను బీసీసీఐ రొటేటింగ్ చేస్తోంది. దీంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, బుమ్రా, భువనేశ్వర్, హార్డిక్ పాండ్యా వంటి ఆటగాళ్లకు…
టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సమకాలీన ఆటగాళ్లలో కోహ్లీ, స్మిత్, రూట్, విలియమ్సన్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అత్యుత్తమ ఆటగాళ్లుగా చలామణి అవుతున్నారు. కానీ వీరిలో విరాట్ కోహ్లీ మాత్రం గత మూడేళ్లుగా ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్నాడు. పరుగుల యంత్రం కోహ్లీ అన్ని ఫార్మాట్లలోనూ ఆడుతున్నా సెంచరీ చేసి మూడేళ్లు దాటిపోతోంది. పేలవ ఫామ్ కారణంగా కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక ఆటగాడిగా…
టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియా చెత్త రికార్డు నమోదు చేసింది. తొలిసారిగా 350కి పైగా పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కాపాడుకోలేకపోయింది. బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన రీ షెడ్యూల్ టెస్టులో ఇంగ్లండ్ ముందు భారత్ 378 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా ఇంగ్లీష్ జట్టు మరో ఏడు వికెట్లు మిగిలి ఉండగానే కొట్టేసింది. అలాగే తొలి ఇన్నింగ్స్‌లో 100కు పైగా పరుగుల ఆధిక్యాన్ని పొంది టీమిండియా ఓడిపోవడం ఇదే తొలిసారి. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా…