BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. అంపైర్ల కోసం కొత్త కేటగిరీ ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
bcci introduced new category for umpires: అంపైర్ల కోసం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అంపైరింగ్‌లో సమర్ధత ఆధారంగా నాలుగు కేటగిరీలు ఉండేవి. ఉత్తమ పనితీరు ఆధారంగా ‘ఏ’, ‘బి’, ‘సి’, ‘డి’ కేటగిరీల ద్వారా అంపైర్లకు స్థానం కల్పించేవారు. అయితే కొత్తగా అంపైరింగ్ విధులను అత్యంత సమర్థతతో నిర్వర్తించే వాళ్ల కోసం బీసీసీఐ కొత్త కేటగిరీ ఏ+ ఏర్పాటు చేసింది. కొత్త కేటగిరి ఏ+లో 11 మంది అంపైర్లకు స్థానం కల్పించింది. ఈ జాబితాలో అంతర్జాతీయ అంపైర్లు అనిల్ చౌదరి, మదన్‌గోపాల్ జయరామన్, వీరేందర్ కుమార్ శర్మ, అనంత పద్మనాభన్, నితిన్ మేనన్, నవదీప్ సింగ్ సిద్దూ, నిఖిల్ పట్వర్ధన్, సదాశివ్ అయ్యర్, ఉల్హాస్ గంధే ఉన్నారు.
Read Also: Viral News Of Gst Bills: షాపింగ్ మాళ్లలో ఇలా చేస్తే.. జీఎస్టీ పడదా?
Also Read
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
- Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
- ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
మరోవైపు ‘A’ కేటగిరీలో 20 మంది, ‘B’ కేటగిరీలో 60 మంది, ‘C’ కేటగిరీలో 46 మంది, ‘D’ కేటగిరీలో 11 మంది అంపైర్లు ఉన్నారు. ఫస్ట్ క్లాస్ గేమ్‌కు అంపైరింగ్ బాధ్యత వహించే ‘A+’, ‘A’ కేటగిరీల్లో ఉన్న అంపైర్లకు బీసీసీఐ రోజుకు రూ. 40వేలు. ఇక ‘B’, ‘C’ విభాగాల్లోని అంపైర్లకు రూ. 30వేల పారితోషికాన్ని బీసీసీఐ చెల్లించనుంది. ఈ మేరకు మాజీ అంతర్జాతీయ అంపైర్లు కే హరిహరన్, సుధీర్ అస్నాని, అమీష్ సాహెబాతో కూడిన సబ్ కమిటీ సిఫారసులను బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఆమోదించింది. అయితే రంజీతో పాటు దేశీయ మ్యాచ్‌లకు విధులు కేటాయింపు కోసమే కొత్త కేటగిరీని ఏర్పాటు చేశామని బీసీసీఐ అధికారులు వెల్లడించారు. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే దేశవాళీ క్రికెట్ గాడిన పడుతోందని.. వచ్చే రెండేళ్లలో దేశవాళీ క్రికెట్ పుంజుకుంటుందని.. అందుకే పూర్తిస్థాయిలో అంపైర్ల ఎంపికను బీసీసీఐ పూర్తి చేసిందని వివరించారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!