T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ లాంటి అగ్ర జట్టును ఓడించిన జింబాబ్వేకు పసికూన నెదర్లాండ్స్ షాక్ ఇచ్చింది. అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వేపై నెదర్లాండ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే బ్యాటింగ్ ఎంచుకోగా 19.2 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. సికిందర్ రజా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడు 24 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 40 పరుగులు చేశాడు. సీన్ విలియమ్స్ 23 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ మీకెరెన్ 3 వికెట్లు తీయగా.. బ్రాండన్ గ్లోవర్, బాస్ డి లీడే తలో 2 వికెట్లు పడగొట్టారు. ఫ్రెడ్ క్లాసెన్ ఒక వికెట్ తీశాడు.
Read Also: Darren Sammy: విండీస్ బోర్డు ఇచ్చే డబ్బుతో కిరాణా సామాను కూడా కొనలేం
అనంతరం 118 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. మ్యాక్స్ ఓడౌడ్ 52 పరుగులతో రాణించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 47 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. టాప్ కూపర్ 32 పరుగులతో రాణించాడు. మధ్య ఓవర్లలో వికెట్లు పడినా స్కోరు తక్కువే కావడంతో నెదర్లాండ్స్ పని సులభమైంది. 18 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. జింబాబ్వే బౌలర్లలో నగర్వ, ముజర్‌బానీ తలో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా ఈ విజయంతో గ్రూప్-2లో ప్రతి జట్టు ఒక్క విజయం అయినా సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా నెదర్లాండ్స్ చిట్టచివరి స్థానంలోనే కొనసాగుతోంది.