T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో అనూహ్యంగా సెమీస్ బెర్త్ పొందిన పాకిస్థాన్ ఇప్పుడు ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం సిడ్నీ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మరో 5 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సొంతం చేసుకుంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ 42 బంతుల్లో 53 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రిజ్వాన్ 43 బంతుల్లో 57 పరుగులతో రాణించాడు. ఓపెనర్లు ఇద్దరూ రాణించడంతో పాకిస్థాన్ గెలుపు వైపు సాగింది. చివర్లో న్యూజిలాండ్ బౌలర్లు వికెట్లు తీసినా అప్పటికే పాకిస్థాన్ విజయం ఖరారైంది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ రెండు వికెట్లు, మిచెల్ శాంట్నర్ ఓ వికెట్ పడగొట్టారు.
Read Also: T20 World Cup: తొలి సెమీస్‌లో రాణించిన పాకిస్థాన్ బౌలర్లు.. న్యూజిలాండ్ స్కోరు ఎంతంటే..?
కాగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సరైన సమయంలో ఫామ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగిన కీలక సెమీఫైనల్ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ అదరగొట్టాడు. టోరీలో సూపర్-12 దశలో ఫామ్ కోల్పోయి తంటాలు పడిన బాబర్ ఆజమ్ తొలి సెమీఫైనల్‌లో 42 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. సూపర్-12లో 5 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 39 పరుగులు మాత్రమే చేసి బాబర్ ఆజమ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఈరోజు కివీస్‌పై చెలరేగి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. దీంతో పాకిస్థాన్ అభిమానులు బాబర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మాత్రం రిజ్వాన్‌ను వరించింది. గురువారం జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఈనెల 13న ఫైనల్‌లో పాకిస్థాన్ టైటిల్ పోరు కోసం పోరాడుతుంది.