IND Vs BAN: మీర్పూర్ టెస్టులో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి టీమిండియా ఆపసోపాలు పడుతోంది. బంగ్లాదేశ్ విధించిన 145 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి కేవలం 45 పరుగులు చేసింది. కీలక ఆటగాళ్లు కేఎల్ రాహుల్ (2), శుభ్‌మన్ గిల్ (7), పుజారా (6), విరాట్ కోహ్లీ (1) పెవిలియన్ చేరారు. క్రీజులో అక్షర్ పటేల్ (26), జైదేవ్ ఉనద్కట్ (3) ఉన్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిదీ హసన్ మిరాజ్‌కు 3 వికెట్లు పడగా, షకీబుల్ హసన్‌కు ఓ వికెట్ దక్కింది. టీమిండియా విజయం సాధించాలంటే ఇంకా 100 పరుగులు చేయాలి.
Read Also: Bigg Boss Revanth Exclusive Interview: టాప్-5లో అతడు ఉంటే బాగుండేది.. నాకు టఫ్ ఉండేది
మరోవైపు రెండో టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టైమ్ వృథా చేస్తున్న బంగ్లాదేశ్ బ్యాటర్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసహనంలో కోహ్లీ చేసిన వ్యాఖ్యలు స్టంప్స్ మైక్‌లో రికార్డయ్యాయి. రెండో రోజు ఆట చివర్లో ఆరో ఓవర్ సందర్భంగా బంగ్లాదేశ్ ఓపెనర్ నజ్ముల్ శాంతో టైమ్ వృథా చేశాడు. ఓవైపు అంపైర్లు ఆటను ముగిద్దామని చూస్తుండగా.. మరోవైపు నాన్‌స్ట్రైకింగ్ వైపు ఉన్న శాంతో షూ లేస్ కడుతూ ఆటను ఆలస్యం చేశాడు. దాంతో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ సహనం కోల్పోయి… ఆ షర్ట్ కూడా విప్పేయ్‌రా అంటూ నోరుపారేసుకున్నాడు.