Team India: టీ20 ప్రపంచకప్ తర్వాత బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు దిగింది. దీంతో సెలక్షన్ కమిటీని తొలగించింది. కొత్త సెలక్షన్ కమిటీ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు సెలక్షన్ ప్యానల్‌లోని ఐదు పోస్టుల కోసం 600 ఈమెయిల్ అప్లికేషన్లు వచ్చాయి. వీటిని ఓపెన్ చేసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనీ పేరిట కూడా దరఖాస్తులు వచ్చాయి. అంతేకాకుండా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ నుంచి కూడా అప్లికేషన్ వచ్చింది.
Read Also: Pawan Kalyan: బాలయ్యతో పవన్.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్
అయితే అసలు విషయం ఏమిటంటే ఇవన్నీ తప్పుడు దరఖాస్తులు అని స్పష్టమైంది. స్పామ్ ఈమెయిల్ ఐడీల నుంచి కొందరు ఆకతాయిలు వీటిని పంపించారు. మరోవైపు తమకు వచ్చిన దరఖాస్తుల్లో 10 మంది హైప్రొఫైల్ క్యాండిడేట్లను బీసీసీఐ ఎంపిక చేయనుంది. ఆ తర్వాత వీరికి ఇంటర్వ్యూలను నిర్వహించి ఐదుగురిని సెలెక్ట్ చేయనుంది. మరోవైపు కొత్త సెలెక్టర్ల నియామకంలో జాప్యం జరుగుతుండటం అనేక సందేహాలకు కారణం అవుతోంది. సాధారణంగా సెలక్టర్ల ఎంపిక కోసం ఏర్పడిన క్రికెట్ సలహా కమిటీ (CAC) దరఖాస్తుల నుండి 10 పేర్లను షార్ట్‌లిస్ట్ చేయాలి. అలా షార్ట్ లిస్ట్ చేసిన వారిని ఇంటర్వ్యూ చేస్తారు. సీఏసీ 10 మంది అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఆపై తుది ఐదుగురిని ఎంపిక చేస్తుంది. దాంతో ఆ ప్రక్రియ ముగుస్తుంది.