IND Vs BAN: మీర్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 70.2 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. ఓవరాల్‌గా బంగ్లాదేశ్ 144 పరుగుల ఆధిక్యం సంపాదించింది. దీంతో టీమిండియా ముందు 145 పరుగుల టార్గెట్ నిలిచింది. లిటన్ దాస్ 73, జకీర్ హసన్ 51 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్, సిరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఉమేష్ యాదవ్, జైదేవ్ ఉనద్కట్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 227 పరుగులకు ఆలౌట్ కాగా టీమిండియా 314 పరుగులు చేసింది. ఇంకా మ్యాచ్ రెండు రోజులు జరగాల్సి ఉండగా టీమిండియా విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఈ టెస్టులోనూ భారత్ విజయం సాధిస్తే రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 ఆధిక్యంతో క్లీన్ స్వీప్ చేయవచ్చు.
Read Also: Vitamin B12 : విటమిన్ బి12 లోపిస్తే ఇన్ని సమస్యలా..?