BCCI: రిషబ్ పంత్ ఐసీయూలో ఉన్నాడు.. ప్రకటించిన బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంపై బీసీసీఐ స్పందించింది. ప్రస్తుతం పంత్ క్షేమంగా ఉన్నాడని, స్పృహలోకి వచ్చాడని పేర్కొంది. పంత్ నుదుటిపై రెండు చోట్ల లోతైన గాయాలు అయ్యాయని, కుడి మొకాలిలో లిగమెంట్ టియర్ వచ్చిందని, కుడి మణికట్టు, బొటనవేలితో పాటు వీపు భాగంలో గాయాలు అయ్యాయని బీసీసీఐ తెలిపింది. పంత్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుందని ప్రకటనలో చెప్పుకొచ్చింది. పంత్ పూర్తిగా కోలుకునే వరకు బోర్డు అండగా ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు బీసీసీఐ వివరించింది.
Read Also: Exams Schedule: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
Also Read
- India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
కాగా ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో టీమిండియా వికెట్ కీపర్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో పంత్‌ను వెంటనే స్థానికులు సమీపంలోని సాక్షమ్ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా పంత్ ఓ ఫైటర్ అని, అతడు పూర్తిగా కోలుకోని మళ్లీ మైదానంలోకి అడుగుపెడతాడని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ తెలిపాడు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ మొత్తం అతనికి అండగా ఉంటుందని స్పష్టం చేశాడు.
Media Statement – Rishabh Pant
The BCCI will see to it that Rishabh receives the best possible medical care and gets all the support he needs to come out of this traumatic phase.
Details here 👇👇https://t.co/NFv6QbdwBD
— BCCI (@BCCI) December 30, 2022
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!