SA vs IND: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కొనసాగుతున్న భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్ట్ రెండో రోజు అసలు టెస్ట్ క్రికెట్ ఎలాంటి అనూహ్య మలుపులు తెస్తుందో అచ్చం అలాగే కొనసాగింది. ఒక్క రోజులోనే 16 వికెట్లు పడడంతో మ్యాచ్ నిరాశాజనకంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 159 పరుగులకే ఆలౌట్ కావడం, ఆ తర్వాత భారత్ 189 పరుగులకే కుప్పకూలిపోవడం ఈ రెండూ బౌలర్ ఫ్రెండ్లీ పిచ్ పరిస్థితులను స్పష్టం చేశాయి. SSMB29 Updates:…
దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫైనల్ కి ముందు జరిగిన ప్రెస్ మీట్ లో ప్రొటీస్ కెప్టెన్ లారా మాట్లాడుతూ.. సొంత మైదానంలో ఆడడం వల్ల భారత్ పై తీవ్ర ఒత్తిడి ఉంటుంది.. ఆ జట్టు గెలవాలని దేశం మొత్తం ఆశిస్తుంది పేర్కొనింది. కానీ ఇవి కేవలం అంచనాలు మాత్రమే.. వాళ్ల ఒత్తిడే మాకు అనుకూలంగా మారుతుందని తెలిపింది.
Gautam Gambhir: మెల్బోర్న్లోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో శుక్రవారం భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో భాగంగా ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే భారత జట్టు ప్రారంభం నుంచే ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించింది. దీంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. భారత జట్టు 18.4 ఓవర్లలో 125 పరుగులు మాత్రమే చేసి ఆల్ ఔట్ అయ్యింది.…
IND vs AUS: మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌పై సునాయాస విజయం సాధించింది. 126 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 13.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి, 40 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను చేధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1–0 ముందడుగు వేసింది. మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఇక నేటి మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన…
IND vs AUS: మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా రెండో టీ20లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా బౌలర్లు ఆ నిర్ణయాన్ని సరిగ్గా వాడుకున్నారు. మొదట బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా కేవలం 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారత టాప్ ఆర్డర్ తడబాటు చూపించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (5) తొందరగా ఔటయ్యాడు. మరోవైపు, పవర్‌ప్లేలో చెలరేగిన అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడాడు.…
India vs Australia: మహిళల ప్రపంచ కప్ 2025లో అతి పెద్ద పోరుకు రంగం సిద్ధమైంది. నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మహిళల జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ కీలకమైన పోరులో ఆస్ట్రేలియా కెప్టెన్ ఎలిస్సా హీలీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, రెండు జట్లూ సెమీస్‌కు తగ్గట్టుగా వ్యూహాత్మక మార్పులతో బరిలోకి దిగాయి. SEBI…
AB De Villiers: టీమిండియా క్రికెట్ దిగ్గజ ద్వయం రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీలపై ఇటీవల కాలంలో వస్తున్న విమర్శలపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీ కెరీర్ ముగింపు దశకు చేరుకోవడం వల్లే కొందరు కావాలని వారిని తక్కువ చేసి మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ – కోహ్లీ ఆరంభం చాలా పేలవంగా ప్రారంభమైంది. మొదటి మ్యాచ్‌లో ఈ ఇద్దరూ…
IND vs AUS: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన కంగారులు మొదట బ్యాటింగ్ చేస్తున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పటికే 7 వికెట్లు నష్టపోయిన పోరాడుతోంది. అయితే, ఈ నేపథ్యంలో భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. అద్భుతమైన క్యాచ్ అందుకున్న శ్రేయాస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు.
Brett Lee: క్రికెట్‌ను ఇష్టపడే ఫ్యాన్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దానిని ఆదాయ వనరులుగా భారీ స్థాయిలో తీర్చిదిద్దడం వెనుక భారత జట్టుది కీలక పాత్ర పోషించిందని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌లీ పేర్కొన్నారు.
IND vs AUS: ఆస్ట్రేలియాతో సిరీస్‌ను కోల్పోయిన టీమ్ఇండియా.. ఈరోజు ( అక్టోబర్ 25న) జరిగే నామమాత్రమైన చివరి మ్యాచ్‌కు రెడీ అయింది. మరోవైపు ఆస్ట్రేలియా సిరీస్ గెలిచిన ఉత్సాహంలో క్లీన్‌స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది.