శనివారం న్యూఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. మ్యాచ్లో భాగంగా టాస్ ముంబై ఇండియన్స్ గెలవగా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బ్యాటింగ్ మొదలుపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట్లో విర విహారాన్ని సృష్టించింది. దానిని ఇన్నింగ్స్ మొత్తం కొనసాగించడంతో నిర్ణిత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్లు కోల్పోయి 257 పరుగులను సాధించింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లో ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ తనదైన స్టైల్ లో 27 బంతులతో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 84 పరుగులతో వీరవిహారం చేసాడు. మరో ఓపెనర్ కూడా అభిషేక్ 27 బంతులతో 36 పరుగులు జోడించడంతో 114 పరుగుల వద్ద మొదటి టికెట్ కోల్పోయింది.
Also Read: Viral Video: పిచ్చి పరాకాష్ట అంటే ఇదే కాబోలు.. రీల్ కోసం ఆ యువకుడు ఏకంగా.. వైరల్ వీడియో..
ఆ తర్వాత వచ్చిన హోప్ 17 బంతుల్లో 41 పరుగులు, కెప్టెన్ రిషబ్ పంత్ 19 బంతుల్లో 29 పరుగులు చేయగా.. చివరిలో స్టబ్స్ 25 బంతుల్లో 48 పరుగులతో, అక్షర పటేల్ 6 బంతుల్లో 11 పరుగులు చేసి అజయంగా నిలిచారు. ఇక ముంబై బోలర్ల విషయానికొస్తే ల్యూక్ వుడ్, జస్ప్రిత్ బూమ్రా, పియూష్ చావ్లా, మహమ్మద్ నబీలు చెరో వికెట్ సాధించారు.