Sanju Samson Six: సంజూ శాంసన్ భారీ సిక్స్.. మహిళా అభిమాని ముఖానికి తగిలిన బంతి.. వీడియో
- భారీ సిక్సర్ బాదిన సంజూ శాంసన్
- మహిళా అభిమాని ముఖానికి తగిలిన బంతి
- బంతి తగలడంతో కన్నీరు పెట్టుకున్న అభిమాని
- కాస్త భయపడ్డట్లు కనిపించిన సంజూ శాంసన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson Six: దక్షిణాఫ్రికా సిరీస్‌లో భారత బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ విచిత్రమైన రీతిలో బ్యాటింగ్ చేశాడు. ఒక మ్యాచ్‌లో సెంచరీ చేస్తే.. మరో రెండు మ్యాచ్‌లలో డకౌట్ కాగా.. చివరి మ్యాచ్‌లో మళ్లీ సెంచరీతో చెలరేగిపోయాడు. జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో సంజూ బ్యాట్ ఝులిపించాడు. సంజూ శాంసన్ 56 బంతులు ఎదుర్కొని 109 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శాంసన్ తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ ఒక మాన్‌స్టర్ సిక్స్ కొట్టాడు. బంతి నేరుగా స్టాండ్స్‌లో పడింది. ఆ బంతి గ్రౌండ్‌ను తాకిన అనంతరం వెళ్లి ఓ మహిళా అభిమాని ముఖంపై తాకింది. దాని కారణంగా ఆమె ఏడవడం ప్రారంభించింది. మహిళ బంతిని తగలడంతో సంజూ శాంసన్ కూడా కాస్త భయపడ్డాడు. అతని మొహం చూస్తుంటే చాలా పశ్చాత్తాపం పడుతున్నట్టు అనిపించింది.
Read Also: IND vs SA: మ్యాచ్ గెలిచిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ ట్రోఫీని ఏం చేశాడో చూడండి(వీడియో)
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
భారత జట్టు 3-1తో సిరీస్ కైవసం
దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి, నాలుగో మ్యాచ్ జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 135 పరుగులు చేసి 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 1 వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. శాంసన్ సెంచరీతో పాటు తిలక్ వర్మ కూడా సెంచరీ సాధించాడు. తిలక్ వర్మ 47 బంతుల్లో అజేయంగా 120 పరుగులు చేశాడు. తిలక్ వర్మ తన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు. వరుసగా 2 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు సాధించిన ఘనత సాధించాడు.
148 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా
284 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో పూర్తిగా పరాజయం పాలైంది. ఆతిథ్య జట్టు 18.2 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా తరఫున ట్రిస్టన్ స్టబ్స్ అత్యధికంగా 43 పరుగులు చేశాడు. డేవిడ్ మిల్లర్ కూడా 36 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్యా, రమణదీప్ సింగ్, రవి బిష్ణోయ్ కూడా తలో వికెట్ తీశారు.
Wishing a quick recovery for the injured fan! 🤕🤞
Keep watching the 4th #SAvIND T20I LIVE on #JioCinema, #Sports18 & #ColorsCineplex 👈#JioCinemaSports pic.twitter.com/KMtBnOa1Hj
— JioCinema (@JioCinema) November 15, 2024
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!