IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కెప్టెన్ పాత్రపై ఇంకా స్పష్టత రాలేదు. రిషబ్ పంత్ నిష్క్రమణ తర్వాత జట్టు కొత్త కెప్టెన్ కోసం వెతుకుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఏడాది అక్షర్ పటేల్‌తో పాటు కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్‌లను జట్టు కెప్టెన్ గా ఎంచుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇకపోతే, జట్టు కోసం మెగా వేలంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లైన కేఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్‌ను కూడా కొనుగోలు చేసింది. ఇదివరకు రాహుల్ గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్ కు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టగా, ఫాఫ్ డు ప్లెసిస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బాధ్యతలు చేపట్టారు.
Also Read: Saif Ali Khan News : సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
తాజాగా వెలువడిన ప్రముఖ నివేదిక ప్రకారం, ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ మేనేజ్మెంట్ అక్షర్ పటేల్‌ను కెప్టెన్‌గా నియమించాలని నిర్ణయించిబాట్లు సమాచారం. అక్షర్ పటేల్ 2019 నుండి ఢిల్లీ జట్టుతో ఉన్నారు. రిషబ్ పంత్ లేకపోవడంతో, అక్షర్ పటేల్ ఇప్పటికీ చాలాసార్లు జట్టుకు నాయకత్వం వహించాడు అయితే, ఈ సీజన్‌లో అక్షర్ పటేల్ కెప్టెన్‌గా కొనసాగితే.. జట్టులో కేఎల్ రాహుల్ కేవలం వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా ఉండవచ్చు. గత సీజన్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఉన్న ఫాఫ్ డు ప్లెసిస్ ఈ సీజన్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు పొందగలరా లేదా అనేది వేచి చూడాలి.
Also Read: Pakistan : నేను నవాజ్ షరీఫ్‌ని కాదు, సైన్యంతో రాజీపడను : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ మేనేజ్మెంట్ మూలం అక్షర్ పటేల్ కెప్టెన్సీ గురించి స్పష్టత ఇచ్చింది. కాగా, జట్టు అధినేత పార్థ్ జిందాల్ ఈ విషయంపై మాట్లాడుతూ.. “కెప్టెన్సీ గురించి మాట్లాడటం కాస్త తొందరగా ఉంది. అక్షర్ పటేల్ ఈ ఫ్రాంచైజీతో చాలా కాలం పాటు ఉన్నాడు. అతను గత సీజన్‌లో వైస్-కెప్టెన్‌గా ఉండటం గమనించాలి” అని పేర్కొన్నారు. ఇక, అక్షర్ పటేల్ ప్రస్తుతం బీసీసీఐ నాయకత్వ సమూహంలో భాగంగా ఉన్నారు. ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో అతను వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దీంతో, ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ ఎంపికైనట్లు అర్థమవుతుంది.