BCCI: బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో భారత జట్టు్కు ఘోర పరాభవం ఎదురైంది. ఐదు టెస్టుల సిరీస్‌ను 1-3 తేడాతో కోల్పోవడంతో పాటు అంతకు ముందు న్యూజిలాండ్‌తో సిరీస్‌ను వైట్‌వాష్‌కు గురైంది. ఈ క్రమంలో శనివారం బీసీసీఐ సమీక్ష సమావేశం చేపట్టింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. బీసీసీఐ గతంలో ఎవరికీ ఇవ్వని అధికారాలు, స్వేచ్ఛను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఇచ్చింది. టీమ్ ఎంపికతో పాటు సహాయక కోచ్‌లను తనకు ఇష్టమైన వారిని తీసుకొనే ఛాన్స్ ఇవ్వగా.. కానీ, ఫలితాలు మాత్రం జీరో వచ్చాయి. దీంతో పాటు సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా కూడా సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయారు. ఇక, కఠిన చర్యలు తీసుకునేందుకు బీసీసీఐ నిర్ణయించుకుంది.
Read Also: Oscar Nominations: కార్చిచ్చు ఎఫెక్ట్.. ఆస్కార్ నామినేషన్లు మరోసారి వాయిదా
ఇక, 2019 నుంచి విదేశీ టూర్లకు భారత సీనియర్ క్రికెటర్లు వెళ్లే టైంలో.. వారితో పాటు కుటుంబ సభ్యులకూ బీసీసీఐ పర్మిషన్ ఇచ్చేది. కానీ, ఇప్పుడు ఇదే ప్లేయర్స్ ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని బీసీసీఐ అనుకుంటుంది. అయితే, ఇప్పటి నుంచి ఏ విదేశీ పర్యటనకైనా భార్య సహా కుటుంబ సభ్యులకు పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. ఐదేళ్ల ముందు వరకు ఉన్న రూల్స్ మళ్లీ తీసుకురావాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. 45 రోజుల విదేశీ టూర్ కు టీమ్ వెళ్లినప్పుడు.. ప్లేయర్స్ కుటుంబ సభ్యులతో ఉండేందుకు కేవలం రెండు వారాలు మాత్రమే అనుమతించాలని నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
Read Also: Law student suicide: లా స్టూడెంట్ ఆత్మహత్య.. మాజీ ప్రియురాలి అరెస్ట్..
అయితే, టీమిండియా హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఇచ్చిన స్వేచ్ఛకూ బీసీసీఐ కత్తెర వేసేందుకు రెడీ అయింది. గంభీర్ మేనేజర్ గౌరవ్ అరోరాకు ఇప్పటి వరకు మ్యాచ్‌లకు హాజరైనప్పుడు టీమ్ ఉండే హోటల్‌లో వసతి కల్పించేవారు. కానీ, ఇక నుంచి అలాంటి వెసులు బాటు ఉండదనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే, స్టేడియంలోని వీఐపీ బాక్స్‌లో కూర్చొనే ఛాన్స్ కూడా తీసేయబోతుంది. సహాయక సిబ్బంది పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించబోతుంది.. ప్రదర్శన ఆధారంగానే వారికి మళ్లీ ఛాన్స్ ఇవ్వనుంది. దీంతో పాటు తాము తీసుకెళ్లే 150 కేజీల లగేజీకి మించి ఉంటే ప్లేయర్లే దానికి ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.