BCCI: గత ఏడాది స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్, ఆ తర్వాత జరిగిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమిండియా చేసిన పేలవ ప్రదర్శన తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఆటగాళ్ల ప్రదర్శనపై సమీక్ష నిర్వహించిన బీసీసీఐ, ప్రదర్శన అంచనాలకు తగ్గట్లుగా ఆటగాళ్లకు అందించే పేమెంట్‌లో మార్పులు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఆటగాళ్లలో జవాబుదారీతనాన్ని పెంచడానికి, అలాగే వారి ప్రదర్శన అంచనాలను మెరుగుపరచడానికి బీసీసీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చేలా ప్లాన్ చేసింది. కేవలం గొప్ప ప్రదర్శన చేసే వారికి మాత్రమే నగదు రూపంలో ప్రోత్సాహకాలు ఇవ్వడం, ఆడిన మ్యాచ్‌ల్లో ప్రదర్శన నిరుత్సాహకరంగా ఉంటే పేమెంట్స్‌లో కోత విధించడం వంటి కార్పొరేట్ తరహా వేరియబుల్ పే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
Also Read: Game Changer : గేమ్ ఛేంజర్ సినిమాపై డైరెక్టర్ శంకర్ షాకింగ్ కామెంట్స్
గతేడాది భారత్ ఆడిన రెండు ప్రధాన సిరీస్‌లు గమనిస్తే, న్యూజిలాండ్ సిరీస్‌లో భారత్ వైట్‌వాష్ అవ్వడం, ఆస్ట్రేలియా సిరీస్‌ను 1-3 తేడాతో కోల్పోవడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా, సీనియర్ ఆటగాళ్లు తగిన ప్రదర్శన చేయకపోవడం బీసీసీఐకి ఈ నిర్ణయానికి ధరి తీసిందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం అమలులో ఉన్న బీసీసీఐ ప్రోత్సాహక విధానం ప్రకారం ఒక సీజన్‌లో 50 శాతం టెస్టుల్లో తుది జట్టులో ఉన్న ఆటగాళ్లు రూ.30 లక్షల ప్రోత్సాహం పొందుతారు. అలాగే 75 శాతం మ్యాచ్‌లు ఆడితే ఈ మొత్తం రూ.45 లక్షలకు పెరుగుతుంది. ఇలాంటి విధానం ఆటగాళ్లు టెస్టులు లేదా వైట్‌బాల్ ఫార్మాట్లకు ప్రాధాన్యం ఇవ్వడం కోసం తీసుకువచ్చింది. కానీ, తాజాగా పర్ఫార్మెన్స్ ఆధారిత జీతాల విధానం మరింత కఠినంగా మారబోతున్నట్లు సమాచారం.
Also Read: TVS Jupiter: అమ్మకాలలో రికార్డ్స్ సృష్టిస్తున్న టీవీఎస్ జూపిటర్
బీసీసీఐ తుదిగా నిర్ణయించే కొత్త విధానం ఆటగాళ్లకు మరింత జవాబుదారీతనాన్ని కల్పించడంతో పాటు జట్టులో కొత్త ఒరవడిని మార్చడానికి ప్రేరణ కలిగించేలా ఉండనుంది. ఇది భారత క్రికెట్‌ను సమర్థవంతంగా ముందుకు నడిపించేందుకు మార్గదర్శకమవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.