ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా శనివారం సాయంత్రం దుబాయ్ చేరుకుంది. ఆదివారం భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ ప్రారంభించి.. ఐసీసీ అకాడమీలో తమ శిక్షణను కొనసాగించింది. అయితే ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రాక్టీస్ సెషన్లో గాయపడ్డాడు. ఆదివారం ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రిషబ్ పంత్ ఎడమ మోకాలికి గాయమైంది.
పాకిస్తాన్లో ఇటీవల ముగిసిన ముక్కోణపు సిరీస్‌లో న్యూజిలాండ్ తమ అనుభవం లేని పేసర్లతో ఆకట్టుకుందని.. వీరి ఫామ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కూడా కొనసాగుతుందని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ టిమ్ సౌథీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ స్టార్ రషీద్ ఖాన్ పై పొగడతల వర్షం కురిపించాడు. పాకిస్తాన్ మాజీ స్టార్ బౌలర్ వసీం అక్రమ్ కంటే రషీద్ ఖాన్ గొప్ప క్రికెటర్ అని రషీద్ లతీఫ్ అభివర్ణించారు.
ముంబై ఇండియన్స్ తమ జట్టులో మార్పులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అల్లా గజన్ఫర్ గాయం కారణంగా ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్నాడు. అయితే.. అతని స్థానంలో ముంబై ఇండియన్స్.. ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహమాన్‌ను జట్టులోకి తీసుకుంది.
WPL 2025: ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరితమైన పోరులో చివరి బంతికి విజయం సాధించింది. మ్యాచ్ ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ చివరి వరకు కొనసాగింది. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో, అరుంధతి రెడ్డి చాకచక్యంగా ఆడుతూ రెండుపరుగులు పూర్తి చేసి ఢిల్లీకి విజయాన్ని అందించింది. దీంతో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఓటమిని చవిచూసింది. Read Also: America : అమృత్ సర్ కు చేరుకున్న అమెరికా అక్రమ వలసదారుల రెండో విమానం..…
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఒక బ్యాడ్ న్యూస్. భారత జట్టుకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ షెల్డాన్ జాక్సన్ తన రిటైర్మెంట్ను ప్రకటించారు.
న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ తన అత్యద్భుతమైన ఫార్మ్‌తో అద్భుతమైన ప్రదర్శనను కనబరచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతను 113 బంతులలో 133 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో కేన్ 13 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో తన ప్రతిభతో కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ జట్టును గెలిపించడమే కాకుండా.. అతని 7,000 వన్డే పరుగుల మైలురాయిని మరింత వేగంగా చేరాడు. విలియమ్సన్ తన 159వ వన్డే ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను సాధించాడు. కాగా విరాట్…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో విజయం సాధించి.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. కాగా.. ఈనెల 12న మూడో వన్డే మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి టీం ఇండియా ప్లేయింగ్-11పై ఉండనుంది. ఇప్పటికే సిరీస్ గెలిచిన భారత జట్టు ఈ మ్యాచ్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది.
India vs England: భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరగనుంది. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌ను 4 వికెట్ల తేడాతో గెలుచుకున్న తర్వాత, టీమిండియా ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. దీనితో కటక్‌లో జరిగే రెండో వన్డే మ్యాచ్ గెలిస్తే భారత్ సిరీస్‌ను గెలుచుకుంటుంది. ఇంగ్లాండ్‌తో జరిగే ఈ వన్డే మ్యాచ్‌లో…
IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నేటి నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక టీమిండియా నుండి హర్షిత్ రాణా, యశస్వి జైస్వాల్ భారత్ తరఫున అరంగేట్రం చేయబోతున్నారు. గాయం కారణంగా విరాట్ కోహ్లీ ఆడటం లేదు. 2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇరు జట్ల మధ్య ఇదే చివరి వన్డే సిరీస్. దీనిని ఛాంపియన్స్…