ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్‌ను ఓడించింది. 209 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. ఢిల్లీ 65 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే.. అశుతోష్ శర్మ అజేయ ఇన్నింగ్స్‌తో అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. ఒక దశలో ఢిల్లీ ఓడుతుందని అందరు అనుకున్నారు. కానీ అశుతోష్ శర్మ (66 *), విప్రాజ్ నిగమ్ (39) కలిసి కీలక భాగస్వామ్యాన్ని అందించారు. అశుతోష్ 31 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 66 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
Read Also: Sugarcane Juice: చెరుకు రసం శరీరానికి నిజంగా మంచిదేనా?
ఈ మ్యాచ్ అనంతరం అశుతోష్ తన ఇన్నింగ్స్‌ను గురువు శిఖర్ ధావన్‌కు అంకితం చేశాడు. ధావన్ ముందు నుంచే అశుతోష్ టాలెంట్‌ను గుర్తించి అతనికి ప్రోత్సాహం ఇచ్చారు. అతని మద్దతు కారణంగానే తాను మెరుగైన ఆటగాడిగా ఎదిగానని అశుతోష్ చెప్పుకొచ్చాడు. అశుతోష్ డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్న వెంటనే మరో సర్‌ప్రైజ్ ఎదురైంది. తన గురువు శిఖర్ ధావన్ వీడియో కాల్ ద్వారా అశుతోష్‌ను అభినందించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తమ సోషల్ మీడియా పేజీలో ‘లవ్ యూ పాజీ’ అంటూ ఈ వీడియోను షేర్ చేసింది. కాగా.. ధావన్ నుండి వచ్చిన అభినందనతో అశుతోష్‌కు మరింత ఉత్సాహాన్ని అందించింది.
Read Also: Robinhood: డేవిడ్ వార్నర్ కు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు
కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ విజయంతో ఐపీఎల్ 2025లో తమ గెలుపును మొదలుపెట్టింది. లక్నో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. ఢిల్లీ మిడిలార్డర్, టెయిలెండర్లు అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన థ్రిల్లింగ్ అనుభూతిని అందించింది. అశుతోష్ శర్మ తొలిసారి శిఖర్ ధావన్‌ను ఐపీఎల్ 2024 ప్రీ-సీజన్ క్యాంప్‌లో కలిశాడు. వీరిద్దరూ అప్పుడు పంజాబ్ కింగ్స్‌లో భాగంగా ఉన్నారు. అశుతోష్ టాలెంట్ చూసి ముగ్ధుడైన ధావన్.. అతనికి తన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. అశుతోష్ రంజీ ట్రోఫీ అరంగేట్రంలో గుజరాత్‌పై సెంచరీ చేసిన ఈ బ్యాట్‌తో ఇది అతనికి చిరస్మరణీయ బహుమతి. దేశవాళీ క్రికెట్‌లో అశుతోష్ శర్మ రైల్వేస్ తరఫున ఆడుతున్నాడు.