ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో మూడవ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) , ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతోంది. చెన్నై జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ సేన 155 పరుగులు సాధించింది. సీఎస్‌కే విజయానికి 156 పరుగులు అవసరం. తిలక్ వర్మ 31 పరుగులు చేయగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 29 పరుగులు సాధించాడు. దీపక్ చాహర్(28) మంచి స్కోర్ కోసం చివరి వరకు ప్రయత్నించాడు. మిగతావారెవరూ కూడా నిలకడగా ఉండి పరుగులు సాధించలేకపోయారు. బౌలింగ్‌లో నూర్ అహ్మద్ రాణించాడు. నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లతో ఎంఐకి కళ్లెం వేశాడు.
READ MORE: Bangladesh: ఇబ్బందుల్లో మహ్మద్ యూనస్.. ఢాకాలో భారీగా సైన్యం.. తిరుగుబాటు పరిస్థితి..?
కాగా.. బరిలోకి దిగిన ముంబైకి పవర్ ప్లేలో మంచి ఆరంభం లభించలేదు. పవర్ ప్లే లో ముంబై ఇండియన్స్ కు పరుగులు వచ్చాయి. కానీ.. తొలి ఓవర్ లోనే రోహిత్ శర్మ డక్ అవుట్ అయ్యాడు. వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. కీలక బ్యాట్స్ మెన్స్ రోహిత్ శర్మ(0)తో పాటు ర్యాన్ రికెల్టన్ (13), విల్ జాక్స్(11) కూడా పెవిలియన్‌కు చేరుకున్నారు. నూర్ అహ్మద్ ఓవర్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(29) స్టంప్ ఔట్ అయ్యాడు. నూర్ అహ్మద్ ఓవర్‌లో రాబిన్ మింజ్(3) బాదిన బంతి జడేజా చేతికి చిక్కింది. తిలక్ వర్మ రూపంలో ముంబై ఇండియన్స్ 6వ వికెట్ కోల్పోయింది. నూర్ అహ్మద్ బౌలింగ్ లో 31 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ కు చేరాడు. నూర్ అహ్మద్ నమన్ ధీర్ (17) ను బౌల్డ్ చేశాడు. నాథన్ ఎల్లిస్(11) ఓవర్‌లో మిచెల్ సాంట్నర్ ఎల్‌బిడబ్ల్యూ ఔట్ అయ్యాడు. ఖలీల్ అహ్మద్ ఓవర్‌లో బౌల్ట్(1) వెనుదిరిగాడు. సత్యనారాయణ రాజు(1), దీపక్ చాహర్(28) నాటౌట్‌గా నిలిచారు. బౌలింగ్‌లో నూర్ అహ్మద్(4), ఖలీల్ అహ్మద్ (3) ఇద్దరూ రాణించారు. రవిచంద్రన్ అశ్విన్(1), నాథన్ ఎల్లిస్(1) చెరో వికెట్ పడగొట్టారు.
READ MORE: Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదుల్ని చుట్టుముట్టిన భద్రతా దళాలు..