ఈరోజు ఇంగ్లాండ్ తో జరిగే ఐదో టీ20 మ్యాచ్‌కు సంజు శాంసన్ ను పక్కన పెట్టనున్నారు. సంజుకు మరిన్నీ అవకాశాలు ఇవ్వాలని తెలిపిన సంజయ్ మంజ్రేకర్. అతడు ఫాంలోకి వస్తే టీమిండియాకు తిరుగులేదని వెల్లడించారు.
Railways vs Delhi : రంజీ ట్రోఫీ 2024-25లో గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ దశలో ఢిల్లీ జట్టు రైల్వేస్‌తో ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా దిగ్గజ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఢిల్లీ జట్టులో ఉన్నాడు.
Rohit Sharma: ప్రస్తుతం ఫామ్ కోసం తెగ కష్టపడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓ పదిహేనేళ్ల అభిమాని రాసిన భావోద్వేగభరితమైన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లేఖ క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. టెస్టు, వన్డేల్లో టీమిండియా సారథిగా ఉన్న హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఇటీవల జరిగిన బోర్డర్-గావస్కర్ టోర్నీలో టీమిండియా ప్రదర్శన నిరాశజనకంగా ఉండటంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రోహిత్ శర్మ ఆటతీరు తగ్గిందని, క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.…
IND vs ENG: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను టీమ్ ఇండియా అద్భుత విజయంతో ప్రారంభించింది. ఇక కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయంతో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక నేడు రెండో మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. రెండో మ్యాచ్‌లో కూడా గెలిచి ఆధిక్యాన్ని కొనసాగించాలని టీమిండియా చూస్తుండగా.. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో విజయం నమోదు చేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది. Also Read: Noman Ali: వయసనేది జస్ట్…
Champions Trophy 2025: శ్రీలంకలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత దివ్యాంగ క్రికెట్ టీమ్ అద్భుత విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు, టోర్నమెంట్ విజేతగా నిలిచింది. భారత దివ్యాంగ క్రికెట్ కౌన్సిల్ (DCCI) ఈ గెలుపును అధికారికంగా ప్రకటిస్తూ.. జట్టు సమిష్టి కృషిని కొనియాడింది. ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ…
BBL 2025: బిగ్‌బాష్ లీగ్ 2025 ఎడిషన్‌లో హోబర్ట్ హరికేన్స్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మంగళవారం (జనవరి 21) రాత్రి జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో హరికేన్స్ సిడ్నీ సిక్సర్స్‌పై 12 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ జరిగిన హరికేన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ లో మిచెల్ ఓవెన్ 3 ఫోర్లు, 3 సిక్సర్ల వేగవంతమైన ఇన్నింగ్స్‌లో భాగంగా 15 బంతుల్లో…
IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కెప్టెన్ పాత్రపై ఇంకా స్పష్టత రాలేదు. రిషబ్ పంత్ నిష్క్రమణ తర్వాత జట్టు కొత్త కెప్టెన్ కోసం వెతుకుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఏడాది అక్షర్ పటేల్‌తో పాటు కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్లను జట్టు కెప్టెన్ గా ఎంచుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇకపోతే, జట్టు కోసం మెగా వేలంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లైన కేఎల్ రాహుల్, ఫాఫ్ డు…
WPL 2025: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) కొత్త సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలయింది. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న WPL మూడవ సీజన్ ఫిబ్రవరి 14, 2025నుండి ప్రారంభం కానుంది. ఈసారి 5 జట్లు ఈ లీగ్‌లో పోటీ పడనున్నాయి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) WPL 2025 షెడ్యూల్‌ను తాజాగా ప్రకటించింది. ఈ టోర్నీ ఫిబ్రవరి 14న ప్రారంభమై, మార్చి 15న జరిగే టైటిల్ మ్యాచ్‌తో ముగియనుంది. ఈసారి WPL…
IMLT20: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML 2025) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గతేడాది ప్రారంభం కావాల్సిన ఈ పొట్టి ఫార్మాట్ లీగ్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. అయితే, ఈసారి ఎలాంటి వాయిదాలు లేకుండా ఈ లీగ్‌ను మొదలు పెట్టేందుకు నిర్వాహకులు పూర్తి సన్నాహాలు చేశారు. ఐఎమ్ఎల్ టోర్నీ ఫిబ్రవరి 22 నుండి ప్రారంభమై, మార్చి 16న ఫైనల్‌తో ముగుస్తుందని అధికారికంగా ప్రకటించారు. ఈ లీగ్ మూడు వేదికలపై జరగనుంది. ఇక ఈ లీగ్‌లో…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతల గురించి ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ తమ అంచనాలను వెల్లడించారు. మైఖేల్ అథర్టన్ మాట్లాడుతూ.. " దక్షిణాఫ్రికాకు మద్ధతిస్తున్నాను. ప్రతి టోర్నమెంట్లో గెలిచే వరకు పోరాడతారు. సౌతాఫ్రికా జట్టు బలంగా ఉంది. ఈ ట్రోఫీని దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంటుంది." అని మైఖేల్ అథర్టన్ తెలిపాడు. మాజీ ఇంగ్లీష్ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈసారి భారత్, ఆస్ట్రేలియాలు ఫైనల్‌కు చేరుకుంటాయని అభిప్రాయపడ్డాడు. అంతే…