దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు శుభారంభం దక్కింది. ఈ టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా… ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (60), కేఎల్ రాహుల్ (51 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో తొలి వికెట్‌కు వీరి జోడి 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అయితే 117 పరుగుల వద్ద మయాంక్ అవుటయ్యాడు.
Read Also: త్వరలో రాజకీయాల్లోకి హర్భజన్ సింగ్
అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన పుజారా ఒక్కబంతికే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో టీమిండియా వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ రెండు వికెట్లను బౌలర్ ఎంగిడి ఖాతాలోకే వెళ్లాయి. ఒకవైపు పుజారా, రహానెలను పక్కకు తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో కేవలం టెస్టులు మాత్రమే ఆడుతున్న పుజారా ఇలా నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకోవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టెస్టుల్లో ఎక్కువసార్లు (9) గోల్డెన్ డక్ అయిన భారత నెంబర్-3 బ్యాట్స్‌మెన్‌గా పుజారా చెత్త రికార్డు నెలకొల్పాడు. దీంతో పుజారాను తప్పించి శ్రేయాస్ అయ్యర్ లేదా విహారీకి ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.