ఐపీఎల్ 2021లో దారుణ పరాజయాలను చవిచూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వచ్చే ఏడాది నిర్వహించే ఐపీఎల్ సీజన్ కోసం టీమ్‌లో పలు మార్పులు చేస్తోంది. దీంతో వచ్చే ఏడాది మెరుగైన ప్రదర్శన చేయాలని ఆ జట్టు భావిస్తోంది. ఇటీవల రిటెన్షన్ ప్రక్రియలో కేవలం ముగ్గురు ఆటగాళ్లనే ఉంచుకుంది. కెప్టెన్ విలియమ్సన్, ఆల్‌రౌండర్ అబ్దుల్ సమద్, బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌లను మాత్రమే సన్‌రైజర్స్ టీమ్ అట్టిపెట్టుకుంది. మిగతా ఆటగాళ్ల కోసం వేలం ప్రక్రియ కోసం వేచి చూస్తోంది.
Read Also: జాతీయ స్థాయి మహిళా షూటర్ అనుమానాస్పద మృతి
అంతేకాకుండా జట్టుకు కొత్త బౌలింగ్ కోచ్‌ను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ డేల్ స్టెయిన్‌ను నియమించినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే బౌలింగ్ కోచ్‌గా డేల్ స్టెయిన్‌కు బాధ్యతలు అప్పగించనుంది. డేల్ స్టెయిన్ గతంలో డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్, బెంగళూరు రాయల్స్ ఛాలెంజర్స్ తరఫున ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. మరోవైపు టీమ్ మెంటార్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్… ఎన్‌సీఏ బాధ్యతలు తీసుకోవడంతో ఐపీఎల్‌కు దూరం కానున్నాడు.