టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఓడిపోవడంతో అందరూ భారత బౌలర్ షమీని నిందించారు. అతడిపై దారుణంగా ట్రోలింగ్ చేశారు. పాకిస్థాన్ బ్యాటింగ్ సమయంలో విజయానికి బంతికో పరుగు అవసరం కాగా.. 18 ఓవర్‌ను భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ షమీచేత వేయించాడు. అయితే మంచు ఎక్కువగా కురవడం, బంతి చేతికి చిక్కకపోవడంతో షమీ వరుసగా 6, 4, 4 సమర్పించుకున్నాడు. దీంతో పాకిస్థాన్ విజయం తేలికైపోయింది. భారత్ మ్యాచ్ ఓడిన తర్వాత సోషల్ మీడియాలో షమీపై ట్రోలింగ్ మొదలైంది.…
టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-1లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 124/9 స్కోరు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా బ్యాట్స్‌మెన్‌లో ముష్ఫీకర్ రహీమ్ (29), మహ్మదుల్లా (19), నసమ్ అహ్మద్ (19), నూరుల్ హసన్ (16), మెహిదీ హసన్ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. టైమల్ మిల్స్ 3 వికెట్లు,…
పాకిస్థాన్‌తో మ్యాచ్ ఓడిపోవడంతో టీమిండియా దృష్టి తరువాతి మ్యాచ్‌పై పడింది. ఈనెల 31న ఆదివారం భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్ ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ సరికొత్త యాడ్ రూపొందించింది. ఈ ప్రకటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను టీజింగ్ చేశాడు. కోహ్లీకి పంత్ ఫోన్ చేసి.. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే తనకు కొత్త ఆలోచన వచ్చిందని చెప్తాడు. న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో వికెట్ పడిన ప్రతీసారి తాను…
టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ ఇప్పటికే పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైంది. అయితే ఆ జట్టుకు పుండు మీద కారం చల్లిన మాదిరిగా మరో షాక్ తగిలింది. న్యూజిలాండ్ జట్టు ప్రధాన పేసర్ ఫెర్గూసన్ టీ20 ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్ ముందే అతడు కాలి గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతడికి ఎంఆర్ఐ స్కాన్ తీయగా ఫ్రాక్చర్ అని తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఫెర్గూసన్‌కు విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేయగా న్యూజిలాండ్ బోర్డు ప్రపంచకప్ నుంచి అతడిని…
టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-1లో కొనసాగుతున్న దక్షిణాఫ్రికా పాయింట్ల ఖాతాను తెరిచింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఓటమి పాలైన ఆ జట్టు.. రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 143/8 స్కోరు చేసింది. ఓపెనర్ లూయిస్ (56) హాఫ్ సెంచరీతో రాణించినా.. అతడికి మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం అందలేదు. కెప్టెన్ పొలార్డ్ (26), సిమ్మన్స్ (16) పరుగులు చేశారు.…
భారత జట్టు మాజీ ఆటగాడు, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖరారైంది. ఇటీవల నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ పదవికి రాజీనామా చేసిన అతడు… మంగళవారం నాడు టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు సమర్పించాడు. ద్రవిడ్‌తో పాటు అతడి సన్నిహితుడు పరాస్ మాంబ్రే బౌలింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. మరోవైపు ఫీల్డింగ్ కోచ్ పదవికి భారత మాజీ క్రికెటర్, హర్యానాకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్…
ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై తొలిసారిగా భారత్ ఓడిపోయింది. దీంతో టీమిండియా అభిమానులు ఎంతో నిరాశ చెందారు. అందరూ టీమిండియా ఓటమికి కారణాలను వెతికారు. కొందరు కోహ్లీపై విమర్శలు చేశారు.. మరికొందరు మెంటార్ ధోనీ నిర్ణయాలను తప్పుపట్టారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు.. టీమిండియా ఓటమికి కూడా అనేక కారణాలు ఉన్నాయనేది నిజం. అయితే క్రికెట్ దేవుడు సచిన్ మదిలో ఏముంది? పాకిస్థాన్‌పై టీమిండియా ఓటమి గురించి సచిన్ కూడా విశ్లేషణ చేశాడు. Read Also: ధోని…
టీ20 ప్రపంచకప్‌లో భారత అభిమానుల అంచనాలు తలకిందులయ్యాయి. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో 152 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 10 వికెట్లతో విజయఢంకా మోగించింది. తద్వారా ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి టీమిండియాపై విజయకేతనం ఎగురవేసింది. మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. రిజ్వాన్ 55 బంతుల్లో 79 నాటౌట్, బాబర్ 52 బంతుల్లో 68 నాటౌట్ పరుగులు చేశారు.…
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్ కోహ్లీ మినహా మిగతా బ్యాటర్లు ఒత్తిడికి చేతులెత్తేశారు. దీంతో మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఇషాన్ కిషన్ పేరు ట్విట్టర్లో ట్రెండింగ్‌లో కనిపించింది. ఎందుకంటే ఇషాన్ కిషన్ బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌తో పాటు ప్రాక్టీస్ మ్యాచ్‌లో అతడు రాణించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ఇషాన్ కిషన్ తన విశ్వరూపం చూపించాడు. ఆ తర్వాత…
టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లకు 151/7 పరుగులు చేసింది. దీంతో పాకిస్థాన్ ముందు 152 పరుగుల టార్గెట్ నిలిచింది. బౌలింగ్ పిచ్ కావడంతో ఆరంభంలో పాకిస్థాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో భారత ఓపెనర్ రోహిత్ డకౌట్ కాగా మరో ఓపెనర్ రాహుల్ 3 పరుగులకే వెనుతిరిగాడు. ఈ రెండు వికెట్లు షహీన్ షా అఫ్రిదికే దక్కాయి. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (13)…