యాషెస్ సిరీస్: రెండో టెస్టులోనూ ఆసీస్‌దే విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి టెస్టులో ఇంగ్లండ్‌పై ఘనవిజయం సాధించిన ఆసీస్… రెండో టెస్టులోనూ ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 473/9 డిక్లేర్డ్ భారీ స్కోరు చేసింది. లబుషేన్ (103), కెప్టెన్ స్మిత్ (93) రాణించారు. బెన్ స్టోక్స్ 3 వికెట్లు సాధించాడు. అయితే బదులుగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ టీమ్ 236 పరుగులకే ఆలౌటైంది. రూట్ (62), మలాన్ (80) రాణించినా మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి వారికి సహకారం లభించలేదు. దీంతో ఆసీస్‌కు 237 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
Read Also: భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌పై కీలక నిర్ణయం
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
- Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
- IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
- Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
అనంతరం సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ తన స్కోరును 230/9 వద్ద డిక్లేర్డ్ చేసి ఇంగ్లండ్‌కు 468 పరుగుల విజయలక్ష్యాన్ని ముందుంచింది. లబుషేన్ (51), ట్రావిస్ హెడ్ (51) రాణించారు. అయితే ఇంగ్లండ్ టాపార్డర్ మళ్లీ విఫలమైంది. తొలి ఇన్నింగ్స్ హీరోలు రూట్, మలాన్ కూడా తక్కువ స్కోర్లకే వెనుతిరగడంతో ఇంగ్లండ్ ఓటమి ఖరారైపోయింది. క్రిస్ వోక్స్ (44) పోరాడినా ఫలితం దక్కలేదు. దీంతో 192 పరుగులకే ఇంగ్లండ్ చాప చుట్టేయడంతో ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో రిచర్డ్ సన్ 5వికెట్లు, స్టార్క్, లయోన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యం సంపాదించింది. మరోవైపు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా రెండో స్థానానికి దూసుకెళ్లింది.

తాజావార్తలు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!