గంగూలీ నేతృత్వంలోని బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను బీసీసీఐ నియమించింది. తొలుత టెస్టులకు వైస్ కెప్టెన్‌గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మను నియమించిన బీసీసీఐ.. అతడు గాయం కారణంగా టెస్టు సిరీస్ నుంచి తప్పుకోవడంతో తాజాగా కేఎల్ రాహుల్‌కు వైస్ కెప్టెన్ పగ్గాలు అప్పగించింది.
Read Also: ఒలింపిక్స్ రేసులోకి హీరో మాధవన్ తనయుడు
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు భారత జట్టుకు చాలా కాలం పాటు వైస్ కెప్టెన్‌గా ఆజింక్యా రహానె కొనసాగాడు. కానీ అతడు పేలవంగా ఆడుతుండటంతో బీసీసీఐ అతడి స్థానంలో రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చింది. తొడ ఎముక గాయం కారణంగా రోహిత్ సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో వైస్ కెప్టెన్సీని మళ్లీ రహానెకు ఇస్తారా అని జోరుగా చర్చ జరిగింది. చివరకు ఈ పదవిని కేఎల్ రాహుల్‌కు దక్కింది. కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా సత్తా చాటుతుండటంతో బీసీసీఐ అతడికి ఓటు వేసింది. అయితే రోహిత్ తిరిగి రాగానే మళ్లీ అతడే వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. కాగా దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ మూడు టెస్టులను ఆడాల్సి ఉంది.