ఫిబ్రవరి తొలివారంలో వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ సందర్భంగా ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. ఇప్పటికే వన్డే సిరీస్ కోసం ఇరు జట్లను సెలక్టర్లు ప్రకటించారు. అయితే ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన వెస్టిండీస్ జట్టులో కొంత మంది సీనియర్ ఆటగాళ్లతో కెప్టెన్ కీరన్ పొలార్డ్‌కు విభేదాలు తలెత్తాయి. ఆల్‌రౌండర్ ఓడెన్ స్మిత్ విషయంలో అతడు వివక్షపూరితంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీంతో వెస్టిండీస్ జట్టులో లుకలుకలు బహిర్గతం అయ్యాయని విండీస్ మీడియాలో…
క్రికెట్లో పసికూన ఆఫ్ఘనిస్థాన్ సంచలనం సృష్టించింది. అండర్-19 ప్రపంచకప్‌లో తొలిసారి సెమీఫైనల్ పోటీలకు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో గురువారం నాడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని ఆఫ్ఘనిస్థాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు రాణించడంతో 135 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కేవలం 130 పరుగులకే పరిమితమైంది. Read Also: ప్రతి జట్టులో ధోనీ లాంటోడు ఉండాలి.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ప్రశంసలు ఈ మ్యాచ్‌లో…
జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు కూడా అందించాడు. ఈ నేపథ్యంలో మహేంద్రసింగ్ ధోనీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ ఛాపెల్ ప్రశంసలు కురిపించాడు. ప్రతి జట్టులోనూ ధోనీ లాంటోడు ఒకడు ఉండాలన్నాడు. సహజ వాతావరణంలో క్రికెట్ నేర్చుకున్న వాళ్లే ఎక్కువ కాలం క్రికెట్ ఆడగలుగుతారని.. అలాంటి వాళ్లలో ధోనీ ఒకడని కితాబినిచ్చాడు. Read Also: వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు భారతజట్టు…
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు సెలక్టర్లు భారత జట్టును ప్రకటించారు. రెండు ఫార్మాట్లకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నట్లు వెల్లడించారు. కేఎల్ రాహుల్ రెండో వన్డే నుంచి అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. ఆల్‌రౌండర్ జడేజా ప్రస్తుతం మోకాలి గాయం నుంచి కోలుకుంటున్నాడని.. అందుకే అతడిని సెలక్ట్ చేయడం లేదని పేర్కొన్నారు. మరోవైపు ఈ సిరీస్‌లకు బుమ్రా, షమీలకు విశ్రాంతి ఇస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి ఫిట్‌గా లేని కారణంగా హార్డిక్…
దక్షిణాఫ్రికా పర్యటనలో విఫలమైన టీమిండియా టెస్ట్ ఆటగాళ్లు పుజారా, రహానెలు జట్టులో స్థానానికే ఎసరు తెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో డిమోషన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నారు. ఇప్పటివరకు గ్రేడ్-ఏలో ఉన్న పుజారా, రహానెలను గ్రేడ్-బి కాంట్రాక్ట్‌కు బీసీసీఐ డిమోషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ 2021 అక్టోబర్ నుంచి 2022 సెప్టెంబర్ వరకు మాత్రమే కొనసాగనుంది. ఈ క్రమంలో 2022 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు కాంట్రాక్టులను బీసీసీఐ సిద్ధం చేస్తోంది. త్వరలోనే…
దక్షిణాఫ్రికా గడ్డపై వరుస పరాజయాలతో డీలా పడ్డ టీమిండియా.. త్వరలో సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో విజయం సాధించి మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రానున్నాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన రోహిత్.. ప్రస్తుతం పూర్తి కోలుకుని ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. రోహిత్ బుధవారం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఫిట్నెస్ పరీక్షకు హాజరుకానున్నాడు. ఆ తర్వాతే సెలక్షన్…
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తన భార్య హేజల్ కీచ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు యువరాజ్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఈ ప్రపంచంలోకి ఓ చిన్నారి వచ్చిన సందర్భంగా తమ గోప్యతను అభిమానులందరూ గౌరవించాలని యువరాజ్ విజ్ఞప్తి చేశాడు. Read Also: టీమిండియాకు ఐసీసీ భారీ జరిమానా.. ఎందుకంటే? ఈ విషయం…
ఇప్పటికే దక్షిణాఫ్రికా పర్యటనలో వరుస పరాజయాలతో డీలా పడ్డ టీమిండియాకు ఐసీసీ భారీ షాకిచ్చింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా నిదానంగా బౌలింగ్ చేసిందని ఆరోపిస్తూ ఐసీసీ భారీగా ఫైన్ విధించింది. రాహుల్ సేన నిర్ణీత సమయం కంటే 2 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసింది. దీంతో టీమిండియాకు ఐసీసీ 40 శాతం జరిమానా విధించింది. దీంతో భారత ఆటగాళ్లకు తమ మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత పడనుంది. ఐసీసీ నియామవాళిలోని…
గత నాలుగేళ్లుగా టీమిండియా మెరుగ్గా రాణిస్తున్నప్పటికీ పరిమిత ఓవర్ల జట్టులో తక్షణమే మార్పులు చేయాలని భారత తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అభిప్రాయపడ్డాడు. 2023 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని తాము ఆడుతున్నామని… దానికి అనుగుణంగా మెరుగైన జట్టును సిద్ధం చేసుకోవాలన్నాడు. భారత జట్టుకు కెప్టెన్సీ వహించాలన్నది తన కల అని.. అది సాకారమైందని కేఎల్ రాహుల్ అన్నాడు. దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఓటమికి ఏదో సాకు చెప్పాలని తాను అనుకోవడం లేదని.. అయితే ఆ ఓటముల…
టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరోసారి సత్తా చాటింది. 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శనతో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా స్మృతి మంధాన నిలిచింది. ఈ విషయాన్ని ఐసీసీ స్వయంగా వెల్లడించింది. ఈ అవార్డు రేసులో ఇంగ్లండ్ ప్లేయర్ టామీ బీమాంట్, దక్షిణాఫ్రికా ప్లేయర్ లిజెల్లె లీ, ఐర్లాండ్ క్రికెటర్ గాబీ లూయీస్ నిలిచినా.. స్మృతి మంధాన వారిని వెనక్కి నెట్టి తాను విజేతగా ఎంపికైంది. Read Also:…