అండర్-19 టీమిండియా కెప్టెన్ యష్ ధుల్ మరో అరుదైన ఘనత సాధించాడు. అతడి నేతృత్వంలోని యువ భారత్ ఇంగ్లండ్‌ను ప్రపంచకప్ ఫైనల్లో మట్టికరిపించి ఐదోసారి వరల్డ్ ఛాంపియన్‌లుగా నిలిచింది. ఈ సందర్భంగా ఐసీసీ యష్ ధుల్‌ను ప్రత్యేకంగా గౌరవించింది. అండర్-19 ప్రపంచకప్ 2022లో విన్నింగ్ కెప్టెన్‌గా నిలిచిన యష్ ధుల్‌ను ఐసీసీ అప్‌స్టోక్స్ మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
Read Also: చారిత్రక వన్డేలో వెస్టిండీస్‌పై భారత్ ఘనవిజయం
అండర్-19 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఐసీసీ మోస్ట్ వాల్యుబుల్ టీమ్‌ను ఎంపిక చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగానే యష్ ధుల్ కెప్టెన్‌గా ఈ టోర్నీలో పాల్గొన్న 8 దేశాల నుంచి అత్యంత మెరుగ్గా రాణించిన మరో 11 మంది భవిష్యత్ స్టార్లను జట్టుగా ఎంపికచేసింది. ఈ జాబితాలో టీమిండియా నుంచి యష్ ధుల్‌తో పాటు.. టోర్నమెంట్‌లో విశేషంగా రాణించిన ఆల్‌రౌండర్ రాజ్ బవాతో పాటు స్పిన్నర్‌విక్కీ ఓశ్వాల్‌కు చోటు దక్కింది.